చిత్రం: కింగ్డమ్; నటీనటులు: విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేశ్, అయ్యప్ప పి.శర్మ, రాజ్‌కుమార్ కసిరెడ్డి, మహేష్, గోపరాజు రమణ తదితరులు; సంగీతం: అనిరుధ్; నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య; దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి;
విడుదల: 31-07-2025

ఎలా ఉందంటే..
డ్రామాతోపాటు కథా ప్రపంచంలో లీనం చేసే విజువల్స్, వాటికి మరింత బలాన్నిచ్చే సంగీతం, తెరపైన పాత్రలు తప్ప నటులే కనిపించని అభినయాలు… ఇలా అన్నీ ఉన్నా ఆ స్థాయిలో భావోద్వేగాలు బలంగా పండించలేకపోయారు.
పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ‘కింగ్డమ్’ ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో నటీనటులు, సాంకేతిక బృందం పడిన శ్రమతో తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. రెండో భాగానికీ అవకాశం ఉండేలా కథని ముగించారు.
ఎవరెలా చేశారంటే..
విజయ్ దేవరకొండలో ఎంత మంచి నటుడు ఉన్నాడో మరోసారి రుజువు చేసే చిత్రమిది. సూరి పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన చేసిన యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకుంటాయి. శివ పాత్రలో సత్యదేవ్ నటన మరో ప్రధాన ఆకర్షణ. ఈ ఇద్దరి తర్వాత సినిమాలో కనిపించే మరో కీలకమైన పాత్ర… మురుగన్. ఆ పాత్రలో మలయాళ నటుడు వెంకటేశ్ చాలా బాగా నటించారు.కథానాయిక భాగ్యశ్రీ బోర్సే పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. సాంకేతికంగా.. సినిమా ఉన్నతంగా ఉంది. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధానబలం. ప్రొడక్షన్ డిజైన్, స్టైలింగ్ కథా ప్రపంచాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేశాయి. సినిమా టేకింగ్, మేకింగ్ విషయంలో దర్శకుడి ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది.
- బలాలు
- + విజయ్ దేవరకొండ
- + కథాప్రపంచం… డ్రామా
- + విజువల్స్, సంగీతం
- బలహీనతలు
- – కొరవడిన భావోద్వేగాలు
- – కొత్తదనం లేని కథనం
- చివరిగా: కింగ్డమ్…తన జాతి కోసం నిలబడిన ఓ నాయకుడి కథ
సౌజన్యం : ఈనాడు లింక్
బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఛానల్ రివ్యూ
పూల చొక్కా ఛానల్ రివ్యూ
మహీధర్ వైబ్స్ ఛానల్ రివ్యూ
సినిమా పిచ్చ ఛానల్ రివ్యూ
రాగడి ఛానల్ రివ్యూ
మూవీ మేటర్స్ ఛానల్ రివ్యూ
మిస్టర్ బి ఛానల్ రివ్యూ
రావణ్ ఫర్ యూ ఛానల్ రివ్యూ
ఆంధ్రజ్యోతి రివ్యూ
ద్వితీయార్థాన్ని ఏ ఆలోచనతో ఖండఖండాలుగా చేసేశారరో అర్థమే కాదు. దాంతో ఫీల్ మిస్ అయిపోయింది. ఏ సన్నివేశంతోనూ ప్రేక్షకుడు మమేకం కాలేకపోతాడు. చివరకు ప్రేక్షకుల మనసుల్లో మెదిలే ప్రశ్నలనే ఓ వాయిస్ ఓవర్ లో వినిపించి… శుభం కార్డు వేశారు. ఆ ప్రశ్నలకు సమాధానం వస్తే గిస్తే ‘కింగ్ డమ్’ సెకండ్ పార్ట్ లో తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో మేకర్స్ కు రెండు భాగాల పిచ్చి పట్టుకుందేమో అనిపిస్తోంది! తాము అనుకున్న కథను ఒక పార్ట్ గా చూపించకలేకపోవడం బలహీనత అనే విషయం వాళ్ళకు అర్థం కావడం లేదు. దాంతో అబ్రాప్ట్ గా మూవీని ముగించేస్తున్నారు. ‘కింగ్ డమ్’ విషయంలోనూ అదే జరిగింది.
నటీనటుల విషయానికి వస్తే… విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. అన్నకోసం గంగవెర్రులెత్తే తమ్ముడిగా బాగా నటించాడు. అన్నదమ్ములు కలిసే సన్నివేశం రక్తికట్టినా… ఆ తర్వాత సీన్స్ ఏవీ బలంగా లేకపోయాయి. అన్న పాత్రలో సత్యదేవ్ బాగా ఇమిడిపోయాడు.
ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ‘హృదయం లోపల’ పాటను కూడా చివరికి తీసేశారు. అంటే ఎంత ప్లానింగ్ లేకుండా స్క్రిప్ట్ ను తయారు చేసుకున్నారో అర్థమౌతోంది.
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కథనో, దర్శకుడినో నమ్మి కోట్ల రూపాయలను విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. కానీ అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందేమో! మేకింగ్ పరంగా సినిమా బాగుంది. రెగ్యులర్ ఫిల్మ్ గోయర్ ను ఈ సినిమా ఆకట్టుకోవడం కష్టమే!
ట్యాగ్ లైన్: ముళ్ళకిరీటం!
రేటింగ్: 2.5/5
సౌజన్యం : ఆంధ్రజ్యోతి లింక్
తుపాకి.కామ్ రివ్యూ
యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘కింగ్డమ్’ప్రోమోలతో ప్రేక్షకులను ఆశల పల్లకిలో ఊరేగించాడు. గౌతమ్ అంటే భిన్నంగా ఏదో చేస్తాడని.. కొత్త అనుభూతి పంచుతాడనే భరోసాతో ‘కింగ్డమ్’థియేటర్లలో అడుగు పెట్టారు. కానీ వారిని ఊరించి ఊరించి ఒకింత నిరాశకే గురి చేస్తాడు. ఓవైపు తన మార్కు చూపిస్తూనే.. ఇంకోవైపు పాపులర్ ‘ట్రెండు’ప్రభావంలో పడిపోయాడా అనిపిస్తుంది ‘కింగ్డమ్’చూస్తున్నంతసేపు. ఈ ఊగిసలాటలో ఈ చిత్రం ప్రేక్షకులకు మిశ్రమానుభూతినే మిగులుస్తుంది. ఏదో గొప్పగా చూడబోతున్నామనే ఆశలు రేకెత్తించి.. చివరికి ఇంతేనా అనుకునేలా ఒకింత నిరాశకు గురి చేస్తోంది. ‘కింగ్డమ్’బాలేదని అనలేం.. అదే సమయంలో బాగుందని ధీమాగానూ చెప్పలేని పరిస్థితి.
క్లైమాక్సులో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ బాగున్నా.. అది అనేక ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం సెకండ్ పార్టులో చూసుకోమన్నట్లుగా లీడ్ ఇచ్చి సినిమాను ఒక అసంతృప్తితోనే ముగించారు. ఓవరాల్ గా చెప్పాలంటే ‘కింగ్డమ్’లో గొప్పగా ఏదో చేయడానికి ఒక ప్రయత్నం జరిగినా.. అది సంతృప్తికరంగా మాత్రం ముగియలేదు. ఒకసారి చూడ్డానికి ఢోకా లేని ఈ సినిమాపై ఎక్కువ అంచనాలను పెట్టుకోకపోవడం మంచిది.
ఇక రైటర్ కమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ప్రయత్నాన్ని తక్కువ చేయలేం కానీ.. తన మీద పెట్టుకున్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. కథ విషయంలో అతను చేసిన కసరత్తు తెరపై కనిపిస్తుంది. టేకింగ్ పరంగా అతను తన ముద్రను చూపించాడు. ఒక దశ వరకు కథాకథనాలను బాగానే నడిపించాడు. కానీ తర్వాత మాత్రం ‘కేజీఎఫ్’తరహా సినిమాల ప్రభావానికి లోనై గాడి తప్పాడనిపిస్తుంది. డ్రామాను అనుకున్నంతగా రక్తికట్టించలేకపోయాడు.
చివరగా: కింగ్డమ్.. ఓ మోస్తరు కిక్కు రేటింగ్: 2.5/5
సౌజన్యం : తుపాకి.కామ్ లింక్


