ఊపిరి పీల్చుకోండి.అనుభూతి చెందండి. జీవించండి! పర్దేశియా…ప్రేమ మీ హృదయాన్ని ఆక్రమించనివ్వండి! 💞
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా కేరళ నేపథ్యంలో ఫీల్‌గుడ్ మూవీగా తెరకెక్కిన చిత్రం పరమ్ సుందరి (Param Sundari). తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. మేకర్స్ బుధవారం ఈ మూవీ నుంచి పరదేశియా… అంటూ సాగే ఓ మెలోడీతో సాగే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. అమితాబ్ బట్టాచార్య ఈ పాటకు సంగీతం అందించారు. సోను నిగమ్, కృష్ణకలి షా, సచిన్ జిగార్ ఆలపించారు. పాట సోల్ ఫుల్ మ్యూజిక్‌తో ఇట్టే మనస్సును తాకేలా ఉంది.
ఇక మూవీ తిరిగి రిలీజ్ డేట్ విషయంలో అనుమానాలు నెలకొన్న సందర్బంలో చిత్ర బృందం ఈ పాటను రిలీజ్ చేసి, పరమ్ సుందరి సినిమాను ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తెలిపారు.