‘సార్‌ మేడమ్‌’ రివ్యూ | విజయ్‌ సేతుపతి, నిత్యామేనన్‌

sir madam movie review

Sir Madam Movie Review || చిత్రం: సార్‌ మేడమ్‌; నటీనటులు: విజయ్‌ సేతుపతి, నిత్యా మేనన్, యోగిబాబు, రోషిని హరిప్రియన్, దీప శంకర్, మైనా నందిని, చెంబన్‌ వినోద్‌ జోస్, శరవణన్, కాళి వెంకట్‌ తదితరులు; రచన, దర్శకత్వం: పాండిరాజ్‌; విడుదల తేదీ: 01-08-2025

వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించడంలో ముందుంటారు విజయ్‌ సేతుపతి, నిత్యా మేనన్‌. ఇప్పుడీ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘సార్‌ మేడమ్‌’ (madam sir movie release date). భార్యాభర్తల అనుబంధాల నేపథ్యంతో అల్లుకున్న కుటుంబ కథతో పాండిరాజ్‌ దీన్ని తెరకెక్కించారు. (sir madam movie review) మరి ఈ కథ ఎలాంటి అనుభూతిని అందించింది?

ఎలా ఉందంటే..

‘‘భార్యాభర్తల అనుబంధం చాలా అద్భుతమైనది.. అందమైనది. కానీ, దాన్ని నిలుపుకొనేందుకు పడే పాట్లున్నాయే వామ్మో.. ప్రాణం పోతోంది’’ అంటూ ఈ చిత్ర ట్రైలర్‌లో ఓ డైలాగ్‌ వినిపించారు విజయ్‌ సేతుపతి. అదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. వైవాహిక బంధంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే కథ ఇది. కొత్త దంపతులు తమ జీవితాల్లో నిత్యం ఎదుర్కొనే సమస్యల్ని.. పెళ్లి బంధాన్ని నిలుపుకోవడానికి పడే పాట్లను దర్శకుడు పాండిరాజ్‌ ఈ చిత్రంలో చాలా సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. నిజానికి ఇది సీరియస్‌గా సాగే సబ్జెక్ట్‌గా కనిపించినప్పటికీ.. నాయకానాయికల జీవితాల్లోని గిల్లికజ్జాలు, గొడవలు ప్రేక్షకుల్ని ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాయింట్‌తో కనెక్ట్‌ అవుతారు. తెరపై కనిపించే ఆ పాత్రలతో ప్రయాణం చేయడానికి కాస్త సమయం తీసుకున్నా, ఆ తర్వాత కథ ఆద్యంతం గిలిగింతలు పెడుతూనే ఉంటుంది.

ప్రీక్లైమాక్స్‌లో నాయకానాయికల విడాకుల నేపథ్యంగా నడిపిన డ్రామా, తన వైవాహిక బంధాన్ని నిలుపుకొనేందుకు హీరో చేసే ప్రయత్నాలు హత్తుకుంటాయి. ముఖ్యంగా పెళ్లి బంధంలోని గొప్పదనాన్ని చాటి చెప్పేలా క్లైమాక్స్‌ను తీర్చిదిద్దుకున్న విధానం మెప్పిస్తుంది. పతాక సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తూనే.. నవ్వులు పంచుతాయి.

ఎవరెలా చేశారంటే..

ఆకాశ వీరయ్య – రాణి పాత్రల్లో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), నిత్యా మేనన్‌ (Nithya Menon) చక్కగా ఒదిగిపోయారు. సహజమైన నటనతో కట్టిపడేశారు. ముఖ్యంగా వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీనే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇటు తల్లికి.. అటు భార్యకు మధ్య నలిగిపోయే సగటు భర్తగా విజయ్‌ సేతుపతి నటన ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు మనసుల్ని హత్తుకుంటుంది. విజయ్‌ సేతుపతి తల్లి, సోదరి పాత్రలతో పాటు అతని అత్త పాత్ర కథపై బలమైన ప్రభావం చూపిస్తుంది. యోగిబాబు, కాళివెంకట్‌ పాత్రలు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాయి. దర్శకుడు పాండిరాజ్‌ తాను రాసుకున్న కథను నిజాయతీగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అయితే స్క్రీన్‌ప్లే రొటీన్‌గా ఉండటం.. నిడివి ఎక్కువవ్వడం ప్రధాన లోపాలు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం కథకు అదనపు బలాన్నిచ్చింది. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బలాలు
  • + కథా నేపథ్యం
  • విజయ్‌ సేతుపతి, నిత్యా మేనన్‌ నటన
  • విరామ సన్నివేశాలు, క్లైమాక్స్‌
  • బలహీనతలు
  •  రొటీన్‌ స్క్రీన్‌ప్లే
  • – సాగదీత సన్నివేశాలు
  • చివరిగా: ‘సార్‌.. మేడమ్‌’ నవ్విస్తారు.. భావోద్వేగాన్ని పంచుతారు.

సౌజన్యం : ఈనాడు, పూర్తి రివ్యూ కోసం లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *