Sundarakanda Telugu movie Review:
చిత్రం: సుందరకాండ; నటీనటులు: నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ తదితరులు; సంగీతం:లియోన్ జేమ్స్, సినిమాటోగ్రఫీ: ప్రదీష్ ఎం వర్మ, రచన, దర్శకత్వం: వెంకటేశ్ నిమ్మలపూడి; విడుదల తేదీ: 27-08-2025


కథేంటంటే: సిద్ధార్థ్ (నారా రోహిత్) ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. మూడు పదుల వయసు దాటిపోతున్నా సరే… అమ్మాయిల్లో తనకు నచ్చిన ఐదు క్వాలిటీస్ లేవంటూ పెళ్లి సంబంధాల్ని తిరస్కరిస్తుంటాడు. స్కూల్లో తనకు సీనియర్ అయిన వైష్ణవి (శ్రీదేవి విజయ్‌కుమార్)లో చూసిన ఆ ఐదు క్వాలిటీస్ తనకు కాబోయే భార్యలో ఉండాలనేది సిద్ధార్థ్ కోరిక. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా అందులో రాజీపడడు. తీరా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్తుండగా ఎయిర్‌పోర్టులో ఐరా (వృతి వాఘాని) సిద్ధార్థ్‌కి ఎదురవుతుంది (Sundarakanda Review). తొలి పరిచయంలోనే ఆమెలో తనకు నచ్చే కొన్ని లక్షణాలను గమనిస్తాడు. దాంతో తన ప్రయాణాన్ని రద్దు చేసుకొని మరీ ఐరాని పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లి గురించి మాట్లాడేందుకు తన కుటుంబంతో కలిసి ఐరా ఇంటికి వెళ్లాక అక్కడ ఎవరూ ఊహించని విషయం తెలుస్తుంది (Sundarakanda Story). అదేంటీ? చిన్నప్పుడు స్కూల్లో తాను ఎంతగానో ఆరాధించిన వైష్ణవికి సిద్ధార్థ్ ఎందుకు దూరమయ్యాడు? మళ్లీ ఆమె తన జీవితంలోకి తిరిగొచ్చాక ఏం జరిగింది? అసలు సిద్ధార్థ్, ఐరా పెళ్లి జరిగిందా? లేదా? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే: వయసు మీద పడిన యువకుడిగా నారా రోహిత్ (Nara Rohith) మంచి నటనని ప్రదర్శించాడు. తనకు అలవాటైన హాస్యం, భావోద్వేగ సన్నివేశాలు చేసి సినిమాపై బలమైన ప్రభావం చూపించారు. వృతి వాఘానికి ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. ఆమె ఆ అవకాశాన్ని అంతే బాగా సద్వినియోగం చేసుకుంది. శ్రీదేవి విజయ్‌కుమార్ (Sridevi Vijaykumar) స్కూల్ డేస్ అమ్మాయిగా మొదలుకొని తెరపైన పలు కోణాల్లో కనిపించింది. ఆమె పాత్రకి తగిన ఎంపిక అని నిరూపించింది. భార్యాభర్తలుగా సునయన-సత్య చేసిన హంగామానే సినిమాకి మరో ఆకర్షణ. అజయ్, వీటీవీ గణేష్ చిన్న పాత్రల్లో కనిపిస్తారు. సాంకేతిక విభాగాల విషయానికొస్తే రచన తర్వాత విజువల్స్, సంగీతానికి మంచి మార్కులు పడతాయి. పాటలు, చిత్రీకరణ విధానం ఆకట్టుకుంటుంది. దర్శకుడికి ఇదే తొలి చిత్రమైనా ఎక్కడా తడబాటు లేకుండా సినిమాని నడిపించాడు. నిర్మాణం బాగుంది.
+ బలాలు
+ స్వచ్ఛమైన హాస్యం
+ ఓ కొత్త కాన్ఫ్లిక్ట్ ఉన్న కథ
+ ప్రథమార్ధం
– బలహీనతలు
– ఊహకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు
చివరిగా: సుందరకాండ… వినోదాల పండుగ
సౌజన్యం : ఈనాడు | పూర్తి రివ్యూ కోసం లింక్


ప్లస్ పాయింట్స్:
మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ఫైనెస్ట్ నటుల్లో నారా రోహిత్ కూడా ఒకరు. ఆ మాట ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పవచ్చు. తన సోలో సినిమా నుంచి మొన్న భైరవం వరకు చూసుకున్నా ఎలాంటి డ్షేడ్ ఉన్న రోల్ ని అయినా చాలా ఈజ్ గా తాను చేస్తారు. ఇప్పుడు సుందరకాండ లో కూడా ఒక లైట్ క్యారెక్టర్ ని కూడా అంతే ఈజ్ గా మంచి నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ మరోసారి ఆకట్టుకుంటుంది. అలాగే ఎమోషనల్ పార్ట్ కూడా చాలా బాగుంది. సెకండాఫ్ లో తనపై ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.
- ఇక ఐరా గా కనిపించిన వ్రితి రోల్ సినిమాలో చాలా బాగుంది. ఆమె పాత్రని తీర్చిదిద్దిన విధానం కానీ అందులో ఆమె నటించిన తీరు బాగా ఇంప్రెస్ చేస్తాయి.
- చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపించిన నటి శ్రీదేవి విజయకుమార్ రోల్ కూడా సినిమాలో బాగుంది. కథలో తన రోల్ చూపించే ఇంపాక్ట్ బాగుంది. అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా ఈ పాత్రని బాగా క్యారీ చేసి రక్తి కట్టించారు.
- అలాగే సినిమాలో కమెడియన్ సత్య మంచి ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. తన టైమింగ్ మరోసారి వర్కౌట్ అయ్యింది. తనతో పాటుగా వాసుకి ఆనంద్, సునైనా, అభినవ్ గోమటం తదితరులు బాగా చేశారు.
- ఈ సినిమా విషయంలో ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది అని సినిమాకే బిగ్ టర్న్ గా ఉంటుంది అని ముందే టాక్ వచ్చింది. నిజంగా అదే రీతిలో ఇంటర్వెల్ ట్విస్ట్ ఉందని చెప్పవచ్చు.
మైనస్ పాయింట్స్:
- ఈ సినిమాలో సెటప్ అంతా మంచి ఎంగేజింగ్ గానే ఉన్నప్పటికీ కథ మాత్రం కొంచెం తెలిసినట్టే ఓ బాలీవుడ్ సినిమాని కూడా మరిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్ తర్వాత కథనం ఎమోషనల్ పరంగా టచ్ మైంటైన్ చేస్తే బాగుణ్ణు కానీ దర్శకుడు కామెడీ పరంగా తీసుకెళ్లారు.
- ఇంకా కొన్ని సన్నివేశాలు ఒకింత ఓవర్ గా అనిపిస్తాయి. అలాగే కొన్ని మూమెంట్స్ కూడా ఏదో క్లాస్ లా అనిపిస్తాయి. ఇక నటుడు నరేష్, అభినవ్ లాంటి వారిని పెద్దగా వినియోగించుకోలేదు అనిపిస్తుంది. వారిపై కామెడీ సీన్స్ ఇంకా పెట్టి ఉంటే బాగుండు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘సుందరకాండ’ ఒక డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. నారా రోహిత్ ఇంప్రెసివ్ నటన, ఇతర నటీనటుల పెర్ఫమెన్స్ లు బాగున్నాయి. అయితే కొన్ని మూమెంట్స్ మాత్రం డల్ గా అనిపిస్తాయి కానీ వీటిని పక్కన పెడితే ఈ చిత్రం ఎంటర్టైన్ చేస్తుంది.
Rating: 3/5
సౌజన్యం : 123telugu.com పూర్తి రివ్యూ కోసం లింక్

తాను నమ్ముకొన్న నారా రోహిత్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా కథను, సన్నివేశాలను అల్లుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సత్య, అభినవ్, వీకే నరేష్ లాంటి కమెడియన్ ఆరిస్టులతో కథను నడిపించిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. రెండున్నర గంటలపాటు ప్రేక్షకుడిని సినిమాకు ఎంగేజ్చేయడంలో తొలి చిత్ర దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి.
ఇక సుందరకాండ సినిమా విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో సిద్దూ పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇతర పాత్రలను పరిచయం చేయడానికి, స్టోరిని విపులంగా చెప్పడానికి దర్శకుడు కాస్త సమయం ఎక్కువగానే తీసుకోవడం.. సినిమాను ఉద్దేశపూర్వకంగా సాగదీశాడా? అనే అనుమానం కలుగుతుంది. కథలో సమస్యను సృష్టించడానికి ఇంటర్వెల్ వరకు సమయం తీసుకొన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే స్టోరీలో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దర్శకుడు వెంకటేష్ అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. ప్రతీ ఐదు నిమిషాలకు ట్విస్టు, ఓ సమస్యను సృష్టించి దానిని క్లియర్ చేస్తూ కథను ముందుకు నడిపించిన విధానం బాగుంది. అయితే వైష్ణవి, సిద్దూ పాత్రల మధ్య చోటు చేసుకొన్న సమస్య అతి సున్నితమైంది. దానిని చాలా మెచ్యురిటీతో డీల్ చేసిన విధానంతోనే ఈ సినిమా సక్సెస్ అయిందనే చెప్పాలి.
సత్య, అభినవ్, నరేష్ సహకారంతో సినిమా భారన్నంతా తన భుజాల మీద మోసి.. విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నాడు. ఇక శ్రీదేవీ విజయ్ కుమార్ ఈ సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్. హుందాగా తన పాత్రలో ఒదిగిపోయారు. నూతన నటి వ్రితీ సినిమాకు కావాల్సిన గ్లామర్ సరుకును అందించడం మాత్రమే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మెప్పించింది. కొరియన్ పిచ్చి ఉన్న భార్యగా రూపాలక్ష్మీ కామెడీని పండించింది. సునైనా, సత్య కాంబినేషన్ బాగుంది. ఇతర నటీనటులంతా ఈ సినిమా విజయానికి కావాల్సిన బలాన్ని అందించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. పాటలు అంత గొప్పగా లేకపోయినా.. లియోన్ జేమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పలు సన్నివేశాలను మ్యూజిక్‌తో ఫీల్ గుడ్‌గా మార్చారు. ఈ సినిమా రాజేశ్ పెంటకోట చేసిన ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. రోహన్ తన కత్తెరకు ఇంకా పదును పెట్టాల్సింది. సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్ : 3.0/5
సౌజన్యం : https://telugu.filmibeat.com / పూర్తి రివ్యూ కోసం లింక్


హీరో నారా రోహిత్ తనకి ఎలాంటి క్యారెక్టర్ సూటుఅవుతుందో అలాంటిదే ఎంచుకున్నాడు. ముదురు వయసు సిద్ధార్థ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాలో చాలా స్టైలిష్‌గా అనిపించాడు. డ్రెస్సింగ్ అద్దిరిపోయింది. యాక్షన్, ఎక్స్ప్రెషన్స్ విషయంలో నారా రోహిత్ నుంచి ఎక్కువ ఆశించడం అత్యాశే అవుతుంది కాబట్టి.. పెర్ఫామెన్స్ పరంగా పాస్ మార్కులు సాధించాడు. చాలా ఏళ్ల తరువాత నారా రోహిత్‌కి సెట్టయ్యే మంచి కథ పడింది. ఆ కథకి న్యాయం చేశాడు.
ప్రేమను ఆశ్వాదిస్తూ.. దానిపై ఎంతో క్లారిటీ ఉంటే తప్ప.. ప్రేమలో ఉండే గమ్మత్తుని అందులో ఉండే మజిలీని తెరపై ఆవిష్కరించలేం. దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి.. ప్రేమ విషయంలో పరిపక్వత చెందినట్టుగానే కథని మలిచారు.
ఇంటర్వెల్ ట్విస్ట్‌తో కథనాన్ని ఆసక్తికరంగా మార్చేశారు. తాను రాసుకున్న ప్రతి సీన్లోనూ వినోదాన్ని జోడించడమే ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. తన కథకి తానే రచయిత కావడంతో.. దర్శకుడు రాసిన మాటలు బాగా పేలాయి.
ఈ కథకి బలం అంటే క్యాస్టింగ్. ఎవరు ఏ పాత్రకి సెట్ అవుతారని లెక్కలేసుకుని మరీ పెట్టినట్టే ఉంటుంది ప్రతి పాత్ర. బాలీవుడ్ భామ వ్రితి వఘ్ని.. ఐరా పాత్రకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. స్టూడెంట్ ప్రేమలో పడ్డ ఈ లెక్చలర్ కథలో ఈమెదే కీ రోల్. తెలుగులో ఆమె ఫస్ట్ మూవీ అయినా కూడా పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ఫ్రెష్ లుక్స్‌తో కనిపించింది. లవ్ అండ్ ఎమోషనల్ సీన్లలో మెచ్యురిటీ చూపించింది.
ఓవరాల్‌గా.. సుందరకాండ ఫీల్ గుడ్ మూవీ. బయట చల్లగా వర్షం పడుతుంటే చేతిలో లేత మొక్కజొన్న పొత్తు పెడితే ఎంత ఆస్వాదిస్తూ తింటామో.. ఈ సినిమా కూడా అలా వెళ్లిపోతుంది. ఫ్యామిలీతో వెళ్లి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.
రేటింగ్ : 3/5
సౌజన్యం : https://telugu.samayam.com పూర్తి రివ్యూ కోసం లింక్

Nara Rohith’s romcom is a mixed bag
Director Venkatesh Nimmalapudi’s Telugu film has a quirky concept, good situational humour, but is too inconsistent to be engaging
- Director Venkatesh Nimmalapudi has a smart premise, though the treatment is a mixed bag. It errs on way too many occasions to be a light, memorable film with a quirky concept. It tends to over-philosophise everything; a few subplots don’t make sense, the songs (by Leon James) surface too frequently and there are silly action sequences.
- Sundarakanda’s USP is its humour, and it could be your only reason to watch it.
సౌజన్యం : ది హిందూ | పూర్తి రివ్యూ ఇంగ్లీష్ లో లింక్


నటీనటుల పనితీరు..
నారా రోహిత్ యూత్ ఫుల్ సినిమా చేసి చాలా కాలమైంది. బొద్దుగా ఉన్నా ఇందులో యూత్ ఫుల్ లుక్ లో కనిపించాడు. సిద్ధార్థ్ పాత్రకు న్యాయం చేశాడు. వృతి వాఘునిది కీలకమైన పాత్రే. గ్లామర్ గా, యాక్టివ్ గా కనిపించింది. శ్రీదేవి విజయ్ కుమార్ షాకింగ్ లుక్‌లో కనిపించింది. టీనేజ్ అమ్మాయిగా, టీనేజ్ దాటిన అమ్మాయికి తల్లిగా రెండు వేరియేషన్స్ పర్ఫెక్ట్గా చూపించింది. ఆమె పాత్రలో నటనకు మంచి స్కోప్ ఉంది. ఇక సినిమాలో మెయిన్ ఎంటర్టైనర్ సత్య అనే చెప్పుకోవాలి. ఆద్యంతం తనదైన శైలి కామెడీతో మెప్పించాడు. భారంగా ఉన్న సన్నివేశాల్లో హాస్యం తో అలరించాడు. అతని భార్యగా బేబీ సునయన కూడా మంచి పాత్రే దక్కింది. రోహిత్ కు అక్కగా వాసుకి క్యారెక్టర్ బావుంది. ఉంది. నరేశ్, రూపాలక్ష్మీకి ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. ఫ్రెండ్స్ గ్యాంగ్ లో అభినవ్ గోమటం బాగా చేశాడు. అజయ్, వీటీవీ గణేష్ చిన్న పాత్రల్లో మెరిశారు. ప్రదేశ్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ బాగుంది. లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఫర్వాలేదు. ‘డియర్ ఐరా’ పాట బాగుంది. మిగిలిన పాటలు బాగున్నా కథకు స్పీడ్ బ్రేక్ అనిపించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. పాత్రలకు దర్శకుడు రాసుకున్న మాటలు ప్లస్ అయ్యాయి. కాలేజ్, సీమంతం సీన్స్ కు కాసంత కత్తెర వేసుంటే క్రిస్పీ గా ఉండేది. ఫైనల్ గా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. పండుగకు చక్కని వినోదాన్ని పంచుతుంది. హిట్ కోసం చూస్తున్న హీరో నారా రోహిత్ కు కమ్ బ్యాక్ అనే చెప్పాలి. ఓ సారి ఫ్యామిలీతో చక్కగా చూసేయవచ్చు.
ట్యాగ్‌లైన్: ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్
రేటింగ్: 2.5/5
సౌజన్యం : ఆంధ్రజ్యోతి | పూర్తి రివ్యూ కోసం లింక్

పూలచొక్కా ఛానల్ వీడియో రివ్యూ

Movies4u ఛానల్ ఆడియో రివ్యూ

Man of Fiction ఛానల్ వీడియో రివ్యూ

Movie Matters ఛానల్ ఆడియో రివ్యూ

Cinemapicha ఛానల్ రివ్యూ


