వార్2 సినిమాపై సమీక్షల సమాహారం | జూ.ఎన్టీఆర్,హృతిక్ రోషన్ | పబ్లిక్ టాక్

War 2: రివ్యూ: ఎన్టీఆర్‌, హృతిక్‌ల స్పై యాక్షన్‌ మూవీ మెప్పించిందా? ఈనాడు రివ్యూ

న‌టీన‌టులు: హృతిక్‌రోష‌న్‌, ఎన్టీఆర్‌, కియారా అడ్వాణీ, అశుతోష్ రాణా, అనిల్ క‌పూర్‌, దిశా సెహ‌గ‌ల్‌, (అతిథి పాత్ర‌ల్లో) అలియాభ‌ట్‌, బాబీ దేవోల్, శ‌ర్వారీ వాఘ్ త‌దిత‌రులు; క‌థ‌, నిర్మాణం: ఆదిత్య చోప్రా; ద‌ర్శ‌క‌త్వం: అయాన్ ముఖ‌ర్జీ; విడుద‌ల తేదీ: 14-08-2025

ఈ ఏడాది ప్రేక్ష‌కులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారతీయ సినిమాల్లో ‘వార్ 2’ (War2 Movie) ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్; స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ ఫ్రాంఛైజీలోకి ఎన్టీఆర్; రావడంతో తెలుగు వారికి మరింత ప్రత్యేకంగా మారింది. అత్యంత భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర‌ తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వం (War2 Director) వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది? హృతిక్ రోషన్‌, ఎన్టీఆర్‌ల పోరాటాలు మెప్పించాయా?

ఎవ‌రెలా చేశారంటే..

War 2 Cast || క‌బీర్ పాత్ర‌లో హృతిక్ (Hrithik Roshan) క‌నిపించ‌డం కొత్త కాదు. ‘వార్‌’కి కొన‌సాగింపుగా, ఆ పాత్ర‌ని అంతే స‌మ‌ర్థ‌ంగా ఇందులో పోషించాడు. యాక్ష‌న్ హీరోగా ఆయ‌న స్టైల్‌, ఎన్టీఆర్‌తో క‌లిసి చేసిన పోరాటాలు, స‌లామ్ అనాలి పాట‌లో డ్యాన్స్‌లు ఆక‌ట్టుకుంటాయి. హృతిక్‌, ఎన్టీఆర్‌కీ మ‌ధ్య పార్ట్‌న‌ర్స్‌గా మంచి కెమిస్ట్రీ పండింది. అత్యుత్త‌మ డ్యాన్స‌ర్ల‌యిన ఆ ఇద్ద‌రూ క‌లిసి స‌లామ్ అనాలి… అంటూ స్టెప్పులేస్తుంటే చూపు తిప్పుకోలేం. 

సాంకేతిక విభాగాల్లో బెంజ‌మ‌న్ జాస్ప‌ర్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. యాక్ష‌న్ హంగామాని అత్యంత స‌హ‌జంగా తెర‌పైకి తీసుకొచ్చారు. ప్రీత‌మ్ బాణీలు మెప్పిస్తాయి. సంచిత్‌, అంకిత్ ద్వ‌యం నేపథ్య సంగీతం సినిమాపై బ‌ల‌మైన ప్ర‌భావ‌మే చూపించింది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌రంగా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సింది. ప్రైవేట్ జెట్ నేప‌థ్యంలో విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాలు మ‌రీ అతిశ‌యంగా అనిపిస్తాయి. ఆదిత్య చోప్రా రాసిన క‌థ బాగున్నా, టెంప్లేట్ మాత్రం ఇదివ‌ర‌క‌టి చిత్రాల్నే గుర్తు చేస్తుంది. శ్రీధ‌ర్ రాఘ‌వ‌న్ స్క్రీన్ ప్లే మెప్పిస్తుంది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. అయాన్ ముఖ‌ర్జీ (War 2 Director) ఇద్ద‌రు స్టార్స్‌ని, వాళ్ల ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేసిన విధానం మెప్పిస్తుంది.

  • బ‌లాలు
  • + హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ న‌ట‌న
  • + యాక్ష‌న్ హంగామా
  • + ప‌తాక స‌న్నివేశాలు
  • బ‌లహీన‌త‌లు
  • – ప్ర‌భావం చూప‌ని భావోద్వేగ కోణం
  • చివ‌రిగా: వార్ 2… ఇద్ద‌రు పార్ట్‌న‌ర్స్ యాక్షన్‌ ఇది
  • సౌజన్యం : ఈనాడు | పూర్తి రివ్యూ కోసం లింక్

> ఆంధ్రజ్యోతి రివ్యూ

‘వార్’లో తాను ధరించిన మేజర్ కబీర్ ధలీవాల్ గానే హృతిక్ రోషన్ ఇందులోనూ కనిపించారు. విక్రమ్ పాత్రలో యన్టీఆర్ నటించారు. ‘వార్’లో కబీర్ కు పోటీదారుగా కెప్టెన్ ఖలీద్ గా టైగర్ ష్రాఫ్ నటంచాడు. కియారా అద్వానీ అందాల ఆరబోతకే పరిమితం కాకుండా కథలో కీలక పాత్ర పోషించింది. బాబీ డియోల్ చివరలో కేమియో రోల్ లో మెరుస్తాడు. అటు హృతిక్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ పోటీపడి నటించారు. నిజానికి ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఇది మంచి ల్యాండింగ్ సినిమా అనే చెప్పాలి. హృతిక్ పాత్రకు దీటుగానే ఎన్టీఆర్ పాత్రను మలిచాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ.

ప్రీతమ్ స్వరాల్లో రూపొందిన ‘ఊపిరి ఊయలగా..’, ‘సలామ్ అనాలి..’ అంటూ సాగే రెండు పాటలు సినిమాలో ఉన్నాయి. అయితే ‘సలామ్ అనాలి..’ పాటలో ఇద్దరు హీరోల డాన్స్ మూవ్ మెంట్స్ చూడాలని యావత్ ఇండియా ఎంతగానో వెయిట్ చేసింది. అయితే సినిమాలో మాత్రం ఇది తుస్సు మనిపించేలా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, చరణ్ చేసిన డాన్స్ చూసిన ప్రేక్షకులకు ఇందులో పాట ఏ మాత్రం ఆనదనే చెప్పాలి. ఇద్దరు ఇండియన్ బెస్ట్ డాన్సర్స్ ని పెట్టుకుని ఆకట్టుకునేలా తీయటంలో దర్శకనిర్మాతలు ఘోరంగా విఫలమయ్యారు. ఇక ఊపిరి ఊయలగా పాట ఎలా ఉన్నా కియారా అందాల ఆరబోత మాత్రం కనువిందు చేస్తుంది. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకె. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫి కథను నడిపించేలా సాగింది.

చివరలో స్పై మూవీస్ అన్నింటినీ ప్రస్తావిస్తూ కబీర్, పఠాన్, టైగర్, రఘ, ఆల్ఫా అన్ని పాత్రలతో సినిమా రావచ్చని హింట్ ఇవ్వటం ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచింది.

ట్యాగ్ లైన్: ఓన్లీ యాక్షన్… నో రియాక్షన్…

రేటింగ్: 2.5/5

సౌజన్యం : ఆంధ్రజ్యోతి | పూర్తి రివ్యూ కోసం లింక్


Barbell Pitch Meetings ఛానల్ వీడియో రివ్యూ


  1. వార్ 2 సినిమాపై జబర్దస్త్ మహీధర్ సమీక్ష

2. సినిమాపిచ్చ

3. మూవీస్4యు ఛానెల్ రివ్యూ

4. కొత్త ముచ్చట ఛానల్ రివ్యూ

5. థై వ్యూ ఛానల్ వీడియో సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *