రజనీకాంత్ హీరోగా, నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్, సౌబిన్‌షాహిర్, మహేంద్రన్
తదితరులు నటిస్తున్న, లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కూలీ’ ఆగస్టు 14న
ప్రపంచవ్యా ప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. తాజాగా విడుదల చేసిన పాటలు, ట్రైలర్ సినిమాపై
అంచనాలను పెంచేశాయి. తాజాగా ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయడంతో టికెట్స్ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో ఓవర్సీస్‌లో రికార్డు నమోదైంది.
విడుదలకు రెండు రోజుల ముందే ‘కూలీ’ రెండు మిలియన్ల క్లబ్‌లో చేరిపోయింది. ప్రీమియర్స్ లోనే ఈ స్థాయిలో
వసూళ్లు సాధించిన మొదటి తమిళ సినిమాగా రికార్డు నెలకొల్పింది (Coolie Record). 2016లో రజనీకాంత్ నటించిన ‘కబాలి’ నార్త్ అమెరికాలో విడుదలకు ముందే 60 వేల డాలర్లు వసూళ్లు చేసిన మొదటి తమిళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత ఆయన రికార్డును ఆయనే బ్రేక్ చేశారు. విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
What’s hotఅన్నీ చూడండి
- No posts found.
గాసిప్స్ అన్నీ చూడండి
రాబోవు సినిమాలు అన్నీ చూడండి
Recent Comments