Bhadrakaali Movie Review

కథేంటంటే..
కిట్టు (విజయ్ ఆంటోని) సెక్రటరియేట్‌లో ఓ పవర్ బ్రోకర్. ఏ వ్యవహారం చక్కబెట్టాలన్నా, అది ఎంత క్లిష్టమైనా తాను మధ్యవర్తిగా ఉండి ప్రభుత్వ వ్యవస్థలోని వ్యక్తుల్ని ఉపయోగించుకుని ఆ పని తేలికగా చేసి పెడుతుంటాడు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి లతకు సంబంధించిన రూ.800కోట్ల భూముల వ్యవహారంలో వేలు పెడతాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగినా పని పూర్తి చేసే క్రమంలో ఓ ఎమ్మెల్యే హత్యకు గురవ్వడం.. దాని వల్ల లతకు రాజకీయంగా కొన్ని సమస్యలు ఎదురవడంతో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ఆమె ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కిట్టూ (Vijay Antony) చేయడమే కాకుండా, అతడు ఏకంగా రూ..6,200కోట్లు వేనకేసినట్లు తెలుస్తుంది. అసలు కిట్టు నేపథ్యమేంటి? సచివాలయం ముందు కాఫీలు అమ్ముకునే తను మొత్తం వ్యవస్థనే శాసించే మీడియేటర్‌గా ఎలా ఎదిగాడు? రాష్ట్రపతి కావాలనుకున్న అభయంకర్‌ను కిట్టు ఎందుకు అడ్డుకోవాలనుకున్నాడు? అసలు వీళ్లిద్దరికీ ఉన్న విరోధం ఏంటి? అన్నది చిత్ర కథ.
ఇదొక విభిన్నమైన పొలిటికల్ థ్రిల్లర్. ఈ వ్యవస్థలో పాతుకుపోయిన ఓ పవర్ బ్రోకర్ తన తెలివితేటలు, శక్తిసామర్థ్యాలతో దేశంలోని అవినీతిపరుల్ని ఏ రకంగా ఆటాడుకున్నాడు?వాళ్ల బారి నుంచి దేశ ప్రజల్ని రక్షించేందుకు ఏం చేశాడు? అన్నది చిత్ర కథాంశం.
- పొలిటికల్ బ్రోకర్ కిట్టు పాత్రలో విజయ్ ఆంటోని ఆద్యంతం సెటిల్డ్‌గా నటించారు. సినిమా మొత్తం తను ఒకే మూడ్‌లో కనిపిస్తారు.
- సంగీతం పరంగా ఈ చిత్రాన్ని పైస్థాయిలో నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ముఖ్యంగా పతాక ఘట్టాల్లో ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
- విజయ్ భార్య పాత్రలో తృప్తి రవీందర్ ఫర్వాలేదనిపిస్తుంది.
- అభయంకర్ పాత్రలో చేసిన నటుడు తనదైన విలనిజంతో ఆకట్టుకుంటాడు.
- మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి.
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్ థ్రిల్లింగ్‌గా ఉన్నా.. దాన్ని అంతే చక్కగా తెరపైకి తీసుకురావడంలో తడబడ్డారు.
- ద్వితీయార్ధం మరీ సాగదీతగా ఉంటుంది.
- విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి.
- నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
- బలాలు
- + విజయ్ ఆంటోని నటన
- + ప్రథమార్ధంలోని కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్
- + నేపథ్య సంగీతం, విజువల్స్
- బలహీనతలు
- – సంక్లిష్టంగా సాగే కథనం..
- – ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
- చివరిగా: అక్కడక్కడా థ్రిల్ చేసే ‘భద్రకాళి’
సౌజన్యం : ఈనాడు | పూర్తి రివ్యూ కోసం లింక్


కిట్టూ ఓ పవర్ఫుల్ బ్రోకర్… దేశంలో ఏ పనైనా చేయగలడు అని చూపించే ఎలివేషన్లతో కథ మొదలైంది. కిట్టూ చేసే ప్రతి పని ఆసక్తిగా కథను ముందుకు తీసుకెళ్లింది. కథ ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుంది. అనేది ప్రేక్షకుడి ఊహకు అందకుండా దర్శకుడు రన్ చేశాడు. స్టోరీ రన్ ఎత్తులు పైఎత్తులు, ఇంటెలిజెన్స్ ఆకట్టుకున్నాయి. కిట్టును పోలీసులు అదుపులోకి తీసుకునే వరకూ కూడా కథ అత్యంత వేగంగా కథ నడుస్తుంది. బ్రోకర్ గా ఉన్నా ఎంతోమందికి మంచి చేస్తూ అతని టార్గెట్ ఏంటో చెప్పకుండా ఆసక్తికరంగా నడిపించారు.
ఇంటర్వెల్ నుంచి కథ ట్రాక్ తప్పిన భావన కలుగుతుంది. సెకండాఫ్లో అతని బాల్యం, బ్రోకర్ గా మారడానికి కారణాలు చూపించారు. కిట్టు వర్సెస్ అభయంకర్ గేమ్ మొదలు అయ్యాక కథ అంతా రెగ్యులర్ ఫార్మెట్లోకి వెళ్లిపోతుంది. ఫస్టాఫ్ లో హీరో చూపించిన ఇంటెలిజెన్స్ సెకెండాఫ్ లో లేదు. ఇన్వెస్టిగేషన్, అభయంకర్ ఆట కట్టించడానికి హీరో వేసిన ప్లాన్స్ ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది. వాట్ నెక్ట్స్ అనేది క్లియర్ గా తెలిసిపోతూ ఉంటుంది. కథలో హీరో ఆశయం చాలా పెద్దది. అయితే అది నెరవేరడం ఇప్పుడున్న పొలిటికల్ వ్యవస్థలో సాధ్యం కాదు. అయితే వాటిని జనాలకు అర్ధమయ్యేలా చెప్పినా సరిపోయేది. అలా చెప్పే ప్రయత్నం చేస్తూ తీసిన సన్నివేశాలు పేలవంగా ఉండి… సెకెండాఫ్ అంతా క్లాస్ పీకిన భావన కలుగుతుంది.
- నటుడిగా విజయ్ ఆంటోని కథల ఎంపిక బావుంటుంది. కథకు తగ్గట్టు అతని పాత్ర తీరు కూడా అలరిస్తుంది. ఈ సినిమాలో కిట్టూ పాత్ర కూడా అలాగే ఉంది. పాత్ర పరిధి మేరకు చక్కగా నటించాడు.
- హీరోయిన్ తృప్తి రవీంద్రది చిన్న పాత్రే. కిట్టూకి భార్యగా చక్కని నటన కనబర్చింది.
- రాష్ట్రపతి కావాలని కొన్నేళ్లగా తపన పడుతున్న వ్యక్తిగా, రాజకీయ నేతల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ప్లాన్స్ ఇచ్చి గవర్నమెంట్ను శాసించే వ్యక్తిగా సునీల్ కిర్పాలనీ ఇందులో కనిపించారు. ఆ పాత్రకు ఆయన న్యాయం చేశాడు.
- స్పెషల్ ఆఫీసర్ రామ్ పాండేగా కిరణ్ నటన బావుంది.
- రియా జీతూ కూడా ఇన్వెస్టిగేషన్ టీమ్ లో కనిపించి మెప్పించారు.
- హీరోకి సపోర్టివ్ రోల్లో మారుతిగా సెల్ మురుగన్ అలరించారు.
- సినిమాటోగ్రఫీ బావుంది.
- విజయ్ ఆంటోని సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది. నేపథ్య సంగీతం ముందుకు తీసుకెళ్లింది.
- నిర్మాణ పరంగానూ బావుంది.
ట్యాగ్ లైన్: రెగ్యులర్ పొలిటికల్ డ్రామా…
రేటింగ్: 2.25/5
సౌజన్యం : ఆంధ్రజ్యోతి | పూర్తి రివ్యూ కోసం లింక్

Man of Fiction ఛానల్ రివ్యూ

Ragadi ఛానల్ వీడియో రివ్యూ

Movie Matters ఛానల్ అడియో రివ్యూ
Cinemapicha ఛానల్ ఆడియో రివ్యూ


