నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ దక్కించుకున్న సినిమాలు.. ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా?

National Film Awards Movies OTT

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (71th National Film Awards-2023) కేంద్రం ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.  జాతీయ ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్‌’కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు షారుక్‌ ఖాన్‌ (జవాన్‌), విక్రాంత్‌ మస్సే (12th ఫెయిల్‌)లు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా ‘మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’ (హిందీ)లో (mrs chatterjee vs norway) నటనకు రాణీ ముఖర్జీని అవార్డు వరించింది. ఉత్తమ దర్శకుడిగా ‘ది కేరళ స్టోరీ’ని (the kerala story) తెరకెక్కించిన సుదీప్తో సేన్‌ దక్కించుకున్నారు. ‘భగవంత్‌ కేసరి’ సహా పలు చిత్రాలకు వివిధ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. మరి ఈ అవార్డులను సొంతం చేసుకున్న సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయో చూసేయండి..

  • ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌;
    ఓటీటీ: జియోహాట్‌ స్టార్‌
  • ఉత్తమ దర్శకత్వం: సుదీప్తో సేన్‌ (‘ది కేరళ స్టోరీ’, హిందీ);
    ఓటీటీ: జీ5
  • ఉత్తమ నటుడు: షారుక్‌ ఖాన్‌ (జవాన్)
    ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌
  • ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే, హిందీ)
    ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌
  • ఉత్తమ సహాయ నటుడు: విజయ రాఘవన్‌ (పూక్కాలం, మలయాళం)
    ఓటీటీ: జియోహాట్‌ స్టార్‌
  • ఉత్తమ సహాయ నటుడు:  ముత్తుపెట్టాయ్‌ సోము భాస్కర్‌ (పార్కింగ్, తమిళం)
    ఓటీటీ: జియోహాట్‌ స్టార్‌
  • ఉత్తమ సహాయ నటి: ఊర్వశి (ఉళ్లోలుక్కు, మలయాళం)
    ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • ఉత్తమ సహాయ నటి: జానకీ బోడివాలా (వష్, గుజరాతీ)
    ఓటీటీ: షెమరూమీ
  • ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: సుకృతి వేణి (గాంధీ తాత చెట్టు, తెలుగు)
    ఓటీటీ: ఈటీవీ విన్‌
  • ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: కబీర్‌ ఖండారే (జిప్సీ, మరాఠీ)
    ఓటీటీ: అందుబాటులో లేదు
  • ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌:  త్రిష థోసర్, శ్రీనివాస్‌ పోకలే, భార్గవ్‌ జగ్దీప్‌ (నాల్‌ 2, మరాఠీ)
    ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (‘ప్రేమిస్తున్నా.., బేబి’)
    ఓటీటీ: ఆహా
  • ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావు (‘చెలియా.., జవాన్‌)
    ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌
  • ఉత్తమ ఛాయాగ్రహణం: పసంతను మొహపాత్రో (‘ది కేరళ స్టోరీ’, హిందీ)
    ఓటీటీ: జీ5
  • ఉత్తమ సంభాషణలు: దీపక్‌ కింగ్రానీ:  (‘సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై, హిందీ)
    ఓటీటీ: జీ5
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): సాయి రాజేశ్‌ నీలం (‘బేబి, తెలుగు)
    ఓటీటీ: ఆహా
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌):  రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ (పార్కింగ్, తమిళం)
    ఓటీటీ: జియోహాట్‌ స్టార్‌
  • ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: సచిన్‌ సుధాకరన్, హరి హరన్‌ మురళీధరన్‌ (యానిమల్, హిందీ)
    ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌
  • ఉత్తమ ఎడిటింగ్‌: మిథున్‌ మురళి, (పూక్కాలమ్, మలయాళం)
    ఓటీటీ: జియోహాట్‌ స్టార్‌
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌:  మోహన్‌దాస్‌ (2018, మలయాళం)
    ఓటీటీ: సోనీలివ్‌
  • ఉత్తమ నృత్య దర్శకత్వం: వైభవ్‌ మర్చంట్‌ (రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహాని, హిందీ)
    ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సచిన్‌ లవ్లేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్‌ (సామ్‌ బహదూర్, హిందీ)
    ఓటీటీ: జీ5
  • ఉత్తమ మేకప్‌: శ్రీకాంత్‌ దేశాయ్‌ (సామ్‌ బహదూర్, హిందీ)
    ఓటీటీ: జీ5
  • ఉత్తమ సంగీతం (నేపథ్యం): హర్షవర్థన్‌ రామేశ్వర్‌ (యానిమల్, హిందీ)
    ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌
  • ఉత్తమ గేయ రచయిత: కాసర్ల శ్యామ్‌ (ఊరు పల్లెటూరు.., బలగం)
    ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • ఉత్తమ స్టంట్‌ కొరియోగ్రఫీ: నందు – పృథ్వీ (హను-మాన్, తెలుగు) 
    ఓటీటీ: జీ5
  • ఉత్తమ సంగీత దర్శకత్వం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌ (వాది, తమిళం)
    ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌
  • ఉత్తమ ప్రజాదరణ చిత్రం: ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహాని’ (హిందీ)
    ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం: సామ్‌ బహదూర్‌ (హిందీ)
    ఓటీటీ: జీ5
  • ఉత్తమ పరిచయ దర్శకుడు: ఆశిష్‌ బెండే (ఆత్మపాంప్లేట్, మరాఠీ)
    ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • ఉత్తమ బాలల చిత్రం: ‘నాల్‌ 2’ (మరాఠీ)
    ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • ఉత్తమ యానిమేషన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ చిత్రం: ‘హను-మాన్‌’ (తెలుగు)
    ఓటీటీ: జీ5
  • స్పెషల్‌ మెన్షన్‌:  ఎంఆర్‌ రాజకృష్ణన్ (రీ రికార్డింగ్, యానిమల్‌)
    ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌
  • ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్‌ కేసరి
    ఓటీటీ: అమెజాన్‌ప్రైమ్‌ వీడియో
సౌజన్యం : ఈనాడు. లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *