‘నేను మీ బ్రహ్మానందం’ పుస్తకావిష్కరణ | ఆరు భాషల్లో అనువాదం !

NENU MEE BRAHMANANDAM (I am your Brahmanandam) book launch | Translated into six languages!

మిమిక్రీ, ‘పాకపాకలు’ షో ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన బ్రహ్మానందం.. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెయ్యికి పైగా చిత్రాలలో నటించారు.

ఆంగ్ల, హిందీ భాషల్లో అనువదించిన బ్రహ్మానందం ఆత్మకథ ‘‘నేను మీ బ్రహ్మానందం’’ పుస్తకాన్ని వెంకయ్యనాయుడు దిల్లీలో విడుదల చేశారు. బ్రహ్మానందం ఆత్మకథ తెలుగు, ఆంగ్లం, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ప్రచురితమైందన్న వెంకయ్యనాయుడు..  ఈ పుస్తకం దేశ వ్యాప్తంగా పాఠకులకు స్ఫూర్తి దాయకమని చెప్పారు.సాధారణ కుటుంబం నుంచి సినీ రంగంలో శిఖరాగ్ర స్థానానికి చేరుకున్న ప్రస్థానం బ్రహ్మానందం సొంతమని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు.

గిన్నిస్‌బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించారని కొనియాడారు. సేవా కార్యక్రమాలలోనూ ముందుండే ఆయన.. మానవతా విలువలకు ప్రతీక అన్నారు.

ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తాయన్న బ్రహ్మానందం.. వాటిని అధిగమించినప్పుడే పైకి ఎదగగలమని చెప్పారు.

 

‘నేను మీ బ్రహ్మానందం –పుస్తక సారాంశం పార్ట్ 1
పుస్తక పరిచయం | ‘నేను’ బ్రహ్మానందం ఆత్మకథ | జీవితం కామెడీ కాదు (Brahmanandam Autobiography)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *