నిషాంచి – అధికారిక టీజర్ | సినిమాల్లోకి – సెప్టెంబర్ 19 | అమెజాన్ MGM స్టూడియోస్ ఇండియా

Nishaanchi – Official Teaser | In Cinemas – September 19 | Amazon MGM Studios India

బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ (Anurag Kashyap) రెండేండ్ల విరామం త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం నిషాంచి (Nishaanchi). అమెజాన్ ఎమ్జీఎమ్ స్టూడియో (Amazon MGM Studios)తో క‌లిసి, JAR పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై (JAR Pictures) రంజ‌న్ సింగ్‌, అజ‌య్ రాయ్ నిర్మించారు. ఐశ్వరీ ఠాక్రే (Aaishvary Thackeray ) హీరోగా ఎంట్రీ ఇస్తుండ‌గా అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌ల‌తో మంచి గుర్తింపును ద‌క్కించుకున్న మోనిక ప‌న్వార్ (Monika Panwar), వేదిక పింటో (Vedika Pinto) క‌థానాయిక‌లు. వినీత్ కుమార్ సింగ్ (Vineet Kumar Singh), కుముద్ మాశ్రా, జీష‌న్ అయుబ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా యూ ట్యూబ్‌లో పెద్ద ర‌చ్చే చేస్తోంది.

నిషాంచి అనేది ఇద్దరు సోదరుల సంక్లిష్ట జీవితాలను పూర్తిగా భిన్నమైన మార్గాల్లోకి నెట్టి, వారి ఎంపికలు వారి విధిని ఎలా రూపొందిస్తాయో ఆవిష్కరించే ఉత్కంఠభరితమైన, సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. పూర్తిగా యూపీ, బీహార్ ప్రాంత ప్ర‌జ‌ల శైలిలో నాటుగా ఈ సినిమాను రూపొందించ‌న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ప్ర‌తీ సీన్‌లో అక్క‌డి ప్రాంతం త‌ర‌హా ర‌ఫ్ డైలాగులు, చేష్ట‌లు, తుఫాకుల వాడకం రియ‌ల్‌గా షూట్ చేశారా అనేలా ఉంది. అంతేగాక ఇంటిమేట్, ముద్దు స‌న్నివేశాలు సైతం చాలా ర‌స్టిక్‌గా తెర‌కెక్కించిన‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో చూసొన వాళ్లు ఇదే ఎంట్రీ టీజ‌ర్‌ ఇలా ఉంటే ఆ త‌ర్వాత వ‌చ్చే ట్రైల‌రు, ఆపైన సినిమా ఇంక ఎంత బోల్డ్‌గా తీసి ఉంటార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నిషాంచి (Nishaanchi) చిత్రాన్నిసెప్టెంబ‌ర్ 19న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి తీసుకు వ‌స్తున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. మీరూ ఈ టీజ‌ర్‌పై ఓ లుక్కేయండి మ‌రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *