OTT entertainment on the Dussehra weekend.. Entertaining movies/series live!

థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts Ott) ఓటీటీ వేదికగానూ సందడి చేస్తోంది. తెలుగు ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్’ (ETV Win)లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ‘ఎక్స్టెండెడ్ కట్’ (అదనపు సన్నివేశాలుండటం)ను ఓటీటీ ప్రేక్షకుల కోసం తీసుకొచ్చారు.


ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మదరాసి’ (Madharaasi). రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రలు పోషించారు. థియేటర్లో యాక్షన్ ప్రియులను అలరించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోనూ ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా (Amazon Prime Video) తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
- గాలి జనార్దన్‌రెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయమైన చిత్రం ‘జూనియర్’ (Junior movie ott). శ్రీలీల హీరోయిన్. జెనీలియా కీలకపాత్ర పోషించారు. జులైలో థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ ఓటీటీకి రావడానికి చాలా సమయం పట్టింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌తోపాటు, ఆహాలోనూ ‘జూనియర్’ స్ట్రీమింగ్కు వచ్చింది. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్’ (The Game: You Never Play Alone). గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తనకు ఎదురైన సవాళ్లను మహిళా గేమ్ డెవలపర్ ఎలా అధిగమించిందన్న పాయింట్‌తో ఈ సిరీస్‌ను రూపొందించారు. దక్షిణాది భాషలతో పాటు, హిందీలోనూ ఇది అందుబాటులోకి వచ్చింది.
- ఇఫ్ (మూవీ) ఇంగ్లీష్
- జీనీ మేక్ విష్ (మూవీ) కొరియన్
- వింక్స్ క్లబ్- ది మ్యాజిక్ ఈజ్ బ్యాక్ సీజన్ 1
- డూడ్స్ సీజన్ 1 (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)


టేల్స్ ఆఫ్ ట్రెడిషన్ (వెబ్ సిరీస్)


- అబాట్ ఎలిమెంటరీ (వెబ్ సిరీస్)
- అన్నపూరణి (మూవీ)

ఆపిల్ ప్లస్ టీవీ
ఓటీటీది సిస్టర్స్ గ్రిమ్ (యానిమేషన్ వెబ్ సిరీస్)

