tribanadhari barbarik reviews | Satyaraj, Udayabhanu, Vasishta N Simha, Satyam Rajesh, Sanchi roy,VTV Ganesh etc
నటీనటులు: సత్యరాజ్, వశిష్ట సింహా, ఉదయభాను, సత్యం రాజేశ్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన, రాజేంద్రన్ తదితరులు
దర్శకత్వం: మోహన్ శ్రీవత్స నిర్మాత: విజయ్ పాల్ రెడ్డి సమర్పణ: మారుతి మ్యూజిక్: ఇన్ఫ్యూజన్ బ్యాండ్ సినిమాటోగ్రఫి: కుషేందర్ రమేష్ రెడ్డి ఎడిటర్: మార్తాండ్ వెంకటేష్ ఆర్ట్: శ్రీనివాస్ పున్నా స్టంట్స్: రామ్ సుంకర
బ్యానర్: వానర సెల్యూలాయిడ్
రిలీజ్ డేట్: 2025-08-29

శ్యామ్ కతు (సత్యరాజ్) పేరు మోసిన మానసిక వైద్య నిపుణుడు. కొడుకు, కోడలు చనిపోవడంతో మనవరాలు నిధి (మేఘన)ని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటాడు. ఓరోజు స్కూల్‌కు వెళ్లిన ఆ పాప కనిపించకుండా పోతుంది. దీంతో శ్యామ్ పోలీసుల్ని ఆశ్రయించగా.. వాళ్లు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. మరి ఆ తర్వాత ఏమైంది? శ్యామ్ మనవరాలు కనపడకపోవడానికి కారణమెవరు? దీనికి ఆ ఊరిలో ఉన్న రామ్ (వశిష్ఠ ఎన్ సింహా), లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను)కు ఏమైనా సంబంధం ఉందా? డబ్బు కోసం వీళ్లిద్దరూ చేస్తున్న అక్రమ కార్యకలాపాలేంటి? ఆఖరికి తన మనవరాలి మిస్సింగ్ కేసును శ్యామ్ ఛేదించాడా? లేదా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. మిస్సింగ్ కేసు మర్డర్ కేసుగా మారడం.. పోలీస్ వ్యవస్థను పక్కకు పెట్టి తన మనవరాలు కోసం శ్యామ్ కతు నేరుగా రంగంలోకి దిగడం ద్వితీయార్ధానికి కీలకం. కథను ముగించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది.
ఓ రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ కథను.. పురాణాల్లోని బార్బరీకుడి పాత్రతో ముడిపెట్టి కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. కానీ, అది కొంతమేరే ఫలితాన్నిచ్చింది. ఇన్ఫ్యూజన్ బ్యాండ్ పాటలు, నేపథ్య సంగీతం.. కుశేందర్ రెడ్డి ఛాయాగ్రహణం సినిమాకి బలాన్నిచ్చాయి.
- బలాలు
- + స్క్రీన్‌ప్లే
- + సత్యరాజ్ నటన
- + కథలోని కొన్ని ట్విస్ట్‌లు
- బలహీనతలు
- – కొరవడిన భావోద్వేగాలు
- – ఊహలకందే క్లైమాక్స్
- చివరిగా: అక్కడక్కడా థ్రిల్ చేసే ‘త్రిబాణధారి బార్బరిక్’ (tribanadhari barbarik review)
సౌజన్యం : ఈనాడు | పూర్తి రివ్యూ కోసం లింక్


ప్లస్ పాయింట్స్ :
టైటిల్ చూడగానే ఇదేదో సోషియో ఫాంటసీ జోనర్ చిత్రం అనేలా ఉంటుంది. ఈ సినిమాకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సత్యరాజ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్‌లో ఆయన పలికించిన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. తన మనవరాలి ఆచూకీ కోసం ఆయన పడే తాపత్రయం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రామ్ పాత్రలో వశిష్ట సింహా కూడా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ ఈ చిత్ర స్క్రీన్ ప్లే అని చెప్పాలి. సస్పెన్స్ అంశాలను రివీల్ చేసే విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లోని సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఎమోషన్‌తో పాటు సమాజంలో నెలకొన్న ఓ మేజర్ ఇష్యూ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇలాంటి పాయింట్‌ను హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఎంగేజింగ్ అంశాలు ముఖ్యం. కానీ, ఇందులో అవి చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సస్పెన్స్‌ను రివీల్ చేసేందుకు ఓ బలమైన కథ ఉండాలి. కానీ ఇందులో చాలా రొటీన్ కథను ఎంచుకోవడం మైనస్.
దర్శకుడు మోహన్ శ్రీవత్స సమాజంలో నెలకొన్న ఓ సోషల్ అంశాన్ని చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు. దీనికి తాత-మనవరాలి ఎమోషన్‌ను యాడ్ చేసి సినిమాను నడిపిన తీరు బాగుంది. ఇన్ఫ్యూజన్ బ్యాండ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. కుశేంధర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటివ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, ‘త్రిబాణధారి బార్బరిక్’ సోషల్ మెసేజ్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్‌గా పర్వలేదనిపిస్తుంది. సత్యరాజ్ పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే వర్క్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. రొటీన్ కథ, కొన్ని ల్యాగ్ సీన్స్ ఈ సినిమాకు మైనస్. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని తక్కువ అంచనాలతో చూస్తే బెటర్.
రేటింగ్ : 2.75/5
సౌజన్యం : 123telugu.com | పూర్తి రివ్యూ కోసం లింక్

శ్యామ్ పాత్రలో సీనియర్ నటుడు సత్యరాజ్‌ను కొత్తగా కనిపించారు. హుందాగా తన పాత్రలో ఒదిగిపోయారు. కీలకమైన, ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటన అనుభవాన్ని చూపించి మెప్పించారు. ఇక వాకిలి పద్మ క్యారెక్టర్లో ఉదయభాను సర్ప్రైజ్, మాస్, టపోరి క్యారెక్టర్లో ఎమోషన్స్ మాత్రమే కాకుండా యాక్షన్ సీన్లలో మెప్పించింది. ఇప్పటి వరకు విలన్ ఇమేజ్ ఉన్న వశిష్ట ఈ సినిమాలో ఎక్కువ భాగం కథను తన భుజాలపై మోశాడని చెప్పాలి.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అందించిన మ్యూజిక్, కుషేందర్ రమేష్ రెడ్డి చిత్రీకరించిన సన్నివేశాలు స్పెషల్ ఎట్రాక్షన్. యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా సాగే ఈ సినిమాకు ఆర్ట్ వర్క్ బాగా వర్కవుట్ అయింది. ఎడిటర్‌గా మార్తాండ్ వెంకటేష్ అనుభవం ఈ సినిమాకు బాగా పనికి వచ్చిందనే విషయం తెర మీద స్పష్టంగా కనిపించింది. ఇంకాస్త నిడివి తగ్గించి ఉంటే.. బెటర్ ఫీల్ ఉండేది. విజయ్ పాల్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
సౌజన్యం : https://telugu.filmibeat.com | పూర్తి రివ్యూ కోసం లింక్



