Junior Movie Review: రివ్యూ: జూనియర్.. కిరీటి, శ్రీలీల యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మెప్పించిందా?
చిత్రం: జూనియర్;
నటీనటులు: కిరీటి, శ్రీలీల, జెనీలియా, డాక్టర్ రవిచంద్రన్, రావు రమేశ్, సత్య, వైవా హర్ష, అచ్యుత్ కుమార్, సుధారాణి తదితరులు;
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్ కుమార్; నిర్మాత: రజనీ కొర్రపాటి; రచన,
దర్శకత్వం: రాధా కృష్ణ రెడ్డి;
విడుదల: 18-07-2025
కథేంటంటే..
Junior Movie Story: జ్ఞాపకాలే ముఖ్యం అనుకునే కుర్రాడు అభి (కిరీటి). ‘అరవయ్యేళ్లొచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని జ్ఞాపకాలు ఉండాలి కదా’ అనేది అతని సిద్ధాంతం.
అయితే ఎక్కడా కొత్తగా అనిపించదు. తెలిసిన ఈ కథని కొత్తగా చెప్పే ప్రయత్నం కనిపించలేదు.
హీరో టాలెంట్‌ని తెరపై ఆవిష్కరిస్తూ, ఓ పెద్ద కథని చెప్పే ప్రయత్నం మాత్రమే చేశారు.
ఎవరెలా చేశారంటే..
కిరీటి (Junior Movie Kireeti) హుషారైన తన నటనతో ఆకట్టుకున్నాడు. డాన్సులు, ఫైట్లు చాలా బాగా చేశాడు. తెరపై కనిపించిన విధానం కూడా బాగుంది. వైరల్ వయ్యారి పాటలో అయితే పైసా వసూల్ అనిపించాడు. శ్రీలీల, కిరీటి పోటాపోటీగా ఆ పాటలో ఆడిపాడారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకి (Kireeti Movie) హైలైట్. సెంథిల్ ఛాయాగ్రహణం మెప్పిస్తుంది. ఎడిటింగ్, కళ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. పాటల రచయిత కళ్యాణ చక్రవర్తి ఈ సినిమాతో మాటల రచయితగానూ మెప్పించారు. రాధాకృష్ణ రెడ్డి దర్శకుడిగా పట్టు ప్రదర్శించారు కానీ, రచనలో కొత్తదనం చూపించలేకపోయారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
- బలాలు
- + కిరీటి హుషారైన నటన
- + ప్రథమార్ధం
- + వైరల్ వయ్యారి గీతం
- బలహీనతలు
- – భావోద్వేగాలు
- – వైవిధ్యం లేని కథ, కథనం
- చివరిగా: జూనియర్… కిరీటి షో
సౌజన్యం : ఈనాడు. పూర్తి రివ్యూ కోసం లింక్