ఘాటి – రివ్యూల సమాహారం – లింకులు

Ghati – Telugu movie – Collection of Reviews – Links

చిత్రం: ఘాటి
 నటీనటులు: అనుష్క, విక్రమ్‌ ప్రభు, చైతన్యరావు, జగపతిబాబు, జిషు సేన్‌ గుప్త, జాన్‌ విజయ్‌, రవీంద్ర విజయ్‌, వీవీటీ గణేశ్‌ తదితరులు
 నిర్మాత: వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
 రచన: చింతికింది శ్రీనివాసరావు
 దర్శకత్వం: క్రిష్‌ జాగర్లమూడి
విడుదల: 05-09-2025

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కనుమల్లో జరిగే కథ ఇది. అక్కడి ఎత్తయిన పర్వతాల మధ్య ఓ కొండ నీడ మరో కొండపై పడే చోట నాలుగు రకాల గంజాయిలు పెరుగుతాయి. వాటిలో అత్యంత నాణ్యమైనది, ఖరీదైనది శీలావతి రకం. ఆ కనుమల్లో పండే ఈ గంజాయి పంటపై పూర్తి ఆధిపత్యం కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్‌), కుందుల నాయుడు (చైతన్య రావు) సోదరులదే. కనుమల్లో పండే గంజాయి పంటను ఘాటీ తెగ కూలీలు పోలీసుల కంట పడకుండా అక్రమంగా నాయుడు సోదరుల అడ్డాకు చేరవేస్తే.. దాన్ని వాళ్లు తమ బాస్‌ మహావీర్‌ (జిషు సేన్‌ గుప్తా)కు పంపుతారు. అతని కార్టెల్‌ దాన్ని దేశ విదేశాలకు అక్రమ మార్గాల్లో ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవడం పరిపాటి. అయితే ప్రాణాలకు తెగించి గంజాయిని అక్రమ రవాణా చేసే ఘాటీలకు కష్టానికి తగ్గ ఫలితం, గౌరవం దక్కకపోవడంతో ఆ తెగకు చెందిన దేశీరాజు (విక్రమ్‌ ప్రభు) ఓ ఆలోచన చేస్తాడు. తన మరదలు షీలావతి (అనుష్క)తో పాటు తోటి ఘాటీలతో కలిసి ఓ కొత్త దందాకు తెర లేపుతాడు. గంజాయిని ద్రవరూపంలోకి మార్చి దేశ విదేశాలకు ఎగుమతి చేయడం మొదలు పెడతారు. అయితే ఈ విషయం నాయుడు సోదరులకు తెలియడంతో ఘాటీలను అంతమొందించేందుకు సిద్ధమవుతారు. మరి ఆ తర్వాత ఏమైంది? తమ తెగలోని జీవితాల్ని బాగు చేసుకోవాలనే సంకల్పంతో దేశీరాజు – షీలావతి కలిసి మొదలు పెట్టిన ఆ వ్యాపారం వాళ్లని ఎన్ని చిక్కుల్లో పడేసింది. ఈ క్రమంలో షీలావతికి జరిగిన అన్యాయమేంటి? నాయుడు సోదరులతో ఆమె ఎలాంటి యుద్ధం చేసింది? అన్నది మిగిలిన కథ.

  • షీలావతిగా పూర్తి రా అండ్‌ రస్టిక్‌ లుక్‌లో అనుష్క ఆకట్టుకుంది. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ అదరగొట్టింది.
  • దేశీరాజు పాత్రకు విక్రమ్‌ ప్రభు న్యాయం చేసే ప్రయత్నం చేశారు.
  • కుందుల నాయుడుగా చైతన్యరావు విలనిజం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది.
  • కాష్టాల నాయుడుగా రవీంద్ర విజయ్‌ ఫర్వాలేదు.
  • జగపతిబాబు, వీటీవీ గణేశ్, జిషు సేన్‌ గుప్తా, రాజు సుందరం పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
  • విద్యాసాగర్‌ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి బలాన్నిచ్చాయి.
  • తూర్పు కనుమల అందాల్ని మనోజ్‌ తన కెమెరాతో చక్కగా ఒడిసిపట్టారు.
  • నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
  • బలాలు
  • + అనుష్క నటన
  • పోరాట ఘట్టాలు
  • విరామ సన్నివేశాలు
  • బలహీనతలు
  •  ఊహలకు అందే కథనం
  • – కొరవడిన భావోద్వేగాలు
  • చివరిగా: ‘ఘాటి’.. అనుష్క యాక్షన్‌ షో

సౌజన్యం : ఈనాడు | పూర్తి రివ్యూ కోసం లింక్

సినిమా ప్రారంభం, ఆర్టిస్ట్‌ పరిచయం, కథలోకి తీసుకెళ్లడం అంతా బాగానే సాగింది. హీరోహీరోయిన్లు తమ దారి వదిలి మళ్లీ పాత రూట్‌లోకి రావాలనుకున్నప్పటి నుంచి కథ ముందుకు కథల్లేదు. ఫస్టాఫ్‌ వరకూ, దేశిరాజు పాత్రను కిల్‌ చేసే దాకా బాగానే సాగిన అక్కడి నుంచి కథలో వేగం తగ్గింది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌, జగపతిబాబు, రాజు సుందరం పాత్రల నడక ప్రేక్షకుల ఊహకు అందేలా ఉన్నాయి. క్రిష్‌ రాసుకున్న అంశాలు బావున్నాయి. ఆ పాత్రలు బలమైనవిగా తెరపై కనిపించలేదు. 

అనుష్క నటన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్‌లో ఆమె చేసుకుంటూ వెళ్లిపోయారు. శీలావతి పాత్రకు తగ్గట్టు ఆమె మారిపోయారు. యాక్షన్‌ సన్నివేశాలకు ఆమె పడిన కష్టం తెరపై కనిపించింది.

  • అనుష్కకు బావగా, దేశిరాజు పాత్రలో తమిళ నటుడు విక్రమ్‌ ప్రభు మెచూర్డ్‌గా నటించాడు.
  • నటనకు పెద్ద స్కోప్‌ లేకపోయినా రవీంద్ర విజయ్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంది. అతని మాటలు, ఎక్స్‌ప్రెషన్స్‌తో క్రూరమైన విలన్‌ అనిపించాడు.
  • జగపతి బాబు, జాన్‌ విజయ్‌, రవీంద్ర విజయ్‌, రాజు సుందరం తదితరులు పరిధి మేర నటించారు.
  • లారిస్సా, జిష్ణు సేన్ గుప్తా క్యారెక్టర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బాగలేదు.
  • సాయిమాధవ్‌ బుర్రా మాటలు అక్కడక్కడా పేలాయి.
  • సంగీత దర్శకుడు సాగర్‌ నాగవెల్లి పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి.
  • తూర్పు కనుమల అందాలను సినిమాటోగ్రఫర్‌ మనోజ్‌ రెడ్డి కాటసాని అద్భుతంగా చిత్రీకరించారు.
  • వీఎఫ్‌ఎక్స్‌ మాత్రం వీక్‌గా అనిపించాయి.
  • తోట తరణి ఆర్ట్‌ వర్క్‌ సినిమాకు ఎసెట్‌.
  • నిర్మాతల ఖర్చు తెరపై కనిపించింది.
  • క్రిష్‌, మన మధ్య జరుగుతున్న కథనే కొత్తగా ఆవిష్కరిస్తారు. అలాంటి అన్ని అంశాలను మేళవించి తీసిన సినిమా ఘాటీ. ఇక్కడ ఆయన ఓ కొత్త విషయాన్ని చెప్పారు. కానీ ప్రేక్షకుల మనసును తాకేలా చెప్పలేకపోయారు. ఘాటీల జీవనాధారం వారి కష్టాలను మాత్రం కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి.
  • సందేశం, అనుష్క నటన కోసం సినిమా చూడొచ్చు.
  • అనుష్క యాక్షన్ షో
  • రేటింగ్‌: 2.5/5

సౌజన్యం : ఆంధ్రజ్యోతి | పూర్తి రివ్యూ కోసం లింక్

స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ఉన్న అనుష్క లాంటి కథానాయిక.. క్రిష్ లాంటి గొప్ప అభిరుచి ఉన్న దర్శకుడు.. తెలుగు ప్రేక్షకులు ఇంతకుముందెన్నడూ చూడని ఒక కొత్త నేపథ్యం ఉన్న కథ.. ‘ఘాటి’ మంచి అనుభూతిని పంచడానికి కావాల్సిన సెటప్ అంతా చాలా బాగా కుదిరింది. కానీ మంచి కథ ఎంచుకుని.. ఆ కథను మరో స్థాయికి తీసుకెళ్లగల నటిని పెట్టుకున్న క్రిష్.. తన మార్కు రసవత్తర కథనాన్ని మాత్రం దానికి జోడించలేకపోయాడు.

అక్కడక్కడా కొన్ని మెరుపులున్నప్పటికీ.. ఓవరాల్ గా ‘ఘాటి’ అంచనాలను అందుకునే చిత్రం కాదు.

అనుష్క సినిమా అంటే.. ఆమె కోసమే థియేటర్లకు వస్తారు ప్రేక్షకులు. కానీ ఇందులో ఆమెకు జోడీగా నటించిన తమిళ నటుడు విక్రమ్ ప్రభు పాత్ర ఉన్నంత ప్రభావవంతంగా అనుష్క పాత్ర లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఏ కథను ఎంచుకున్నా.. దాని లోతుల్లోకి వెళ్లి ప్రేక్షకులనూ అంతే ఇన్వాల్వ్ చేయించే క్రిష్.. ఈసారి మాత్రం తన మార్కు చూపించలేకపోయాడు. కథ ఆరంభం బాగున్నా.. ఒక దశ దాటాక రొటీన్ టెంప్లేట్లోకి వెళ్లిపోయే ‘ఘాటి’.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తించలేకపోయింది. ప్రేక్షకుల అంచనాలను దాటి కొత్తగా ఏమీ అందించలేకపోయింది.

కథా నేపథ్యంలో ఉన్న కొత్తదనం.. రెండు మూడు ఎపిసోడ్ల కోసం.. చాన్నాళ్ల తర్వాత అనుష్కను స్క్రీన్ మీద చూడడం కోసం అయితే ‘ఘాటి’పై ఒక లుక్కేయొచ్చు కానీ.. అనుష్క-క్రిష్ కలయికలో అద్భుతాలను ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.

  • కొత్త సంగీత దర్శకుడు సాగర్ నాగవెల్లి పాటల విషయంలో నిరాశ పరిచాడు. నేపథ్య సంగీతం అక్కడక్కడా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది.
  • మనోజ్ రెడ్డి కాటసాని ఛాయాగ్రహణం బాగుంది. పశ్చిమ కనుమల నేపథ్యంలో విజువల్స్ బాగున్నాయి.
  • నిర్మాణ విలువలకు ఢోకా లేదు. మంచి క్వాలిటీతో సినిమాను నిర్మించారు.
  • సాయిమాధవ్ బుర్రా మాటలు బాగున్నాయి
  • చింతకింది శ్రీనివాసరావు రాసిన కథ ఆసక్తి రేకెత్తించేదే. కానీ దానికి క్రిష్ తన మార్కు కథనం మాత్రం జోడించలేకపోయాడు.
  • ఎప్పుడూ సటిల్ గా కథను నరేట్ చేస్తూ బలమైన భావోద్వేగాలతో మెప్పించే క్రిష్.. ఈసారి మాత్రం తనకు నప్పని లౌడ్ స్టయిల్లో కథనాన్ని నడిపించాడు. ఆయన్నుంచి ఆశించే కొత్తదనం కూడా మిస్సయింది.

చివరగా: ఘాటి.. గాడి తప్పింది

రేటింగ్- 2.25/5

సౌజన్యం : https://www.tupaki.com | పూర్తి రివ్యూ కోసం లింక్

Barbell Pitch Meetings ఛానల్ వీడియో రివ్యూ

THYVIEW వీడియో రివ్యూ

Ragadi వీడియో రివ్యూ

Jabardasth Mahidhar వీడియో రివ్యూ

నిప్పు నాగరాజ్ ఆడియో రివ్యూ

Movies4u ఆడియో రివ్యూ

మూవీ మేటర్స్ వీడియో రివ్యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *