చిత్రం: కొత్తపల్లిలో ఒకప్పుడు
నటీనటులు: మనోజ్ చంద్ర, మోనిక.టి, ఉషా బోనెల, రవీంద్ర విజయ్, ప్రవీణ పరుచూరి, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేమ్‌సాగర్ తదితరులు; నిర్మాతలు: గోపాలకృష్ణ పరుచూరి & ప్రవీణ పరుచూరి; సమర్పణ: రానా దగ్గుబాటి; దర్శకత్వం: ప్రవీణ పరుచూరి;
విడుదల తేదీ: 18-07-2025

ఎలా ఉందంటే…
గ్రామాల్లోని సామాజిక, రాజకీయ స్థితిగతులు, విశ్వాసాల్ని ప్రతిబింబిస్తూ సాగే కథ ఇది.
ఎవరెలా చేశారంటే..
రామకృష్ణ పాత్రతో మనోజ్ చంద్ర మెప్పించాడు. తెరపై అమాయకంగా కనిపించిన ఆయన పాత్రకి తగ్గ ఎంపిక అనిపిస్తాడు. అందం పాత్రలో ఉషా బోనెల, సావిత్రిగా మోనిక నటనలో సహజత్వం ఉట్టిపడింది. రెడ్డి పాత్రలో బెనర్జీ కీలకంగా కనిపిస్తారు. ఆయన నటన కూడా కొత్తగా ఉంది. దర్శకురాలు ప్రవీణ పోషించిన పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. దర్శకురాలు కొన్ని సన్నివేశాలపై మాత్రమే ప్రభావం చూపించారు. విజువల్స్‌లోనూ, నిర్మాణంలోనూ నాణ్యత కొరవడింది.
- బలాలు
- + కథా నేపథ్యం
- + ప్రథమార్ధంలో హాస్యం
- + విరామ సన్నివేశాలు
- బలహీనతలు
- – నిర్మాణంలో కొరవడిన నాణ్యత
- – ద్వితీయార్ధం
- చివరిగా: కొత్తపల్లిలో ఒకప్పుడు… అప్పుడప్పుడూ అక్కడక్కడా మెప్పిస్తుంది
సౌజన్యం : ఈనాడు.నెట్ | పూర్తి రివ్యూ లింక్ కోసం ఇక్కడికి వెళ్ళండి

ఈ సినిమా ద్వారా దర్శక నిర్మాత ప్రవీణ పరుచూరి జనాలకు చెప్పాలనుకున్న అసలు కథ వేరు. చదువుకోని వారే కాదు, చదువుకున్న వారు సైతం తమ కొందరు స్వలాభం కోసం చేసే కుట్రలలో భాగస్వాములు అవుతున్నారు? దేవుడు పేరు చెప్పి చేసే మోసంలో ఎలా బలి అయిపోతున్నారు? అనేది చెప్పాలనుకున్నారు.
మూఢ నమ్మకాలు మనుషుల్ని ఎలా గుడ్డివాళ్ళను చేస్తాయో చూపించాలనుకున్న దర్శకురాలు ప్రవీణ ప్రయత్నం అంతగా సఫలం కాలేదు. ఇలాంటి ఓ సీరియస్ సబ్జెక్ట్ ను చూడాల్సి వస్తుందని మానసికంగా సిద్థంగా లేని ప్రేక్షకులకు ఇదో చిందరవందర గందరగోళ వ్యవహారంగా అనిపిస్తుంది.
భారత గ్రామీణ ప్రజల మూఢత్వాన్ని విశ్వాసాలను ప్రశ్నిస్తూ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమాను తెరకెక్కించారు. ఇందులోనే ఒక పాత్ర చేత ‘దేవుడంటే నిజమో అబద్ధమో కాదు నమ్మకం’ అని చెప్పించారు దర్శకురాలు ప్రవీణ. అయితే… ఆ నమ్మకానికి, మూఢ నమ్మకానికి మధ్య ఉన్న తేడాను మరింత బలంగా చెప్పి ఉంటే బాగుండేది. అప్పుడు సినిమా ప్రజామోదం పొందే ఆస్కారం ఉండేది.
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: కొత్తపల్లిలో… గందరగోళం!
సౌజన్యం : ఆంధ్రజ్యోతి | పూర్తి రివ్యూ కోసం లింక్
Filmy Focus Originals ఛానెల్ వారి రివ్యూ కింద చూడండి 👇🏿
Man Of Fiction ఛానెల్ వారి రివ్యూ కింద చూడండి 👇🏿