Kishkindhapuri movie – collection of Reviews and Links
చిత్రం: కిష్కింధపురి
నటీనటులు: బెల్లకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్, శాండీ మాస్టర్, మర్కంద్ దేశ్‌పాండే, హినా భాటియా తదితరులు
సంగీతం: చైతన భరద్వాజ్; సినిమాటోగ్రఫీ: చిన్మయ్ సలాస్కర్; ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే
నిర్మాత: సాహు గారపాటి
రచన, దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి;
విడుదల: 12-09-2025


రాఘవ్ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్), మైథిలి (అనుపమ) ప్రేమికులు. ఆ ఇద్దరూ మరొక స్నేహితుడు (సుదర్శన్)తో కలిసి ఘోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్స్‌ని నిర్వహిస్తుంటారు. థ్రిల్ కోరుకునే వాళ్లందరినీ కలిపి ఓ పాడుబడిన బంగ్లాల్లోకి తీసుకెళ్లి అక్కడ దెయ్యాలు ఉన్నాయని నమ్మిస్తూ థ్రిల్ పంచడమే ఆ టూర్ ఉద్దేశం. అలా ఓసారి 11 మందితో కలిసి కిష్కింధపురి అనే ఊరి పరిసరాల్లో ఉన్న సువర్ణమాయ అనే రేడియో స్టేషన్‌కి వెళతారు. 1989లోనే పాడుబడిన స్టేషన్ అది. అందులోకి అడుగు పెట్టాక రేడియో నుంచి ఓ వాయిస్ వినిపిస్తుంది. అది దెయ్యంలా మారిన వేదవతి వాయిస్ అని ఆ తర్వాత తెలుస్తుంది. సువర్ణమాయలోకి అడుగు పెట్టిన 11 మందిలో ఎవ్వరినీ వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది వేదవతి. చెప్పినట్టుగానే వెంటనే ఆ బృందంలో ముగ్గురు చనిపోతారు. ఆ తర్వాత అందులోని ఓ చిన్నారి టార్గెట్ అవుతుంది. అది పసిగట్టిన రాఘవ్ తన ప్రాణాల్ని అడ్డుపెట్టి దెయ్యానికి ఎదురెళతాడు. మరి ఆ చిన్నారిని రక్షించాడా? మిగిలినవాళ్ల పరిస్థితి ఏమిటి? అసలు ఆ వేదవతి ఎవరు? ఎందుకు దెయ్యంలా మారింది? సువర్ణమాయ స్టేషన్‌తో ఆమెకున్న సంబంధం ఏమిటి? అందులోకి వెళ్లినవాళ్లని ఎందుకు చంపేస్తోంది?అన్నది చిత్ర కథ.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సామ్ సీఎస్ (Sam CS Music Director) నేపథ్య సంగీతం చిత్రానికి హైలైట్. చేతన్ భరద్వాజ్ స్వరపరిచిన అమ్మ పాట బాగుంది. విజువల్స్ మెప్పిస్తాయి. ఎడిటింగ్ పదునుగా ఉండటం కలిసొచ్చింది. నిర్మాణం ఉన్నతంగా ఉంది. దర్శకుడు కౌశిక్ ఓ కొత్త నేపథ్యంలోనే కథని రాసుకున్నాడు. అయితే, కథనం విషయంలోనే ఇంకొన్ని కసరత్తులు చేయాల్సింది.
- బలాలు
- + భయపెట్టే సన్నివేశాలు
- + నేపథ్య సంగీతం.. ఛాయాగ్రహణం
- + నాయకానాయికల జోడీ
- బలహీనతలు
- – ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
- చివరిగా: కిష్కింధపురి… భయపెట్టే సువర్ణమాయ
సౌజన్యం : ఈనాడు | పూర్తి రివ్యూ కోసం లింక్


1989లో కిష్కింధరపురి అనే ఊళ్లో సువర్ణ మాయ అనే మూతబడిన రేడియో స్టేషన్, అందులో ఐదుగురు మరణాలతో కథ మొదలుపెట్టాడు దర్శకుడు. అక్కడి నుంచి ప్రస్తుత సమయంలో ఘోస్ట్ రైడ్ టూర్ అంటూ తిరిగే ఓ టీమ్ దగ్గరికొచ్చింది. వాళ్లకు ఎదురైన సవాళ్ల నేపథ్యంలో హారర్ థ్రిల్లర్‌గా మలిచారు. ఫస్టాఫ్‌లో ఘోస్ట్ రైడ్ జస్ట్ ఫన్ రైడ్‌లా సాగింది. దీంతో బెల్లంకొండకు ఈసారి హిట్ ఖాయమనే అనే భావన కలిగింది. ద్వితీయార్థంలో ఆ వాయిస్ వికలాంగుడైన విసృత పుత్రదని. ఆ మరణా వెనక ఉన్నది తానే అని తెలుస్తుంది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన వారిపై రివేంజ్ తీర్చుకోవడానికి తల్లి సెంటిమెంట్‌ను జోడించి అల్లిన కథ టోటల్‌గా ట్రాక్ తప్పేలా చేసింది. క్లైమాక్స్ లో శ్రీరామ రక్షా సన్నివేశం మాత్రం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. విసృత పుత్ర టాక్ర్‌ని దర్శకుడు సరిగా డీల్ చేయలేకపోవడంతో థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకులకు ముళ్ల మీద కూర్చునట్లే అనిపిస్తుంది. దీనికి తోడు చివర్లో ఈ సినిమాకు తల్లి పాత్రను చూపిస్తూ సీక్వెల్‌కి లీడ్ ఇచ్చారు. అంటే తల్లి పాత్రకు కొనసాగింపు ఉంటుందన్నట్లు చూపించడం మరింత హాస్యాస్పదం అనిపిస్తుంది.
రాఘవ పాత్ర కోసం బెల్లంకొండ శ్రీనివాస్ బాగానే కష్టపడ్డాడు. మలయాళ బ్యూటీ అనుపమ క్లౌమాక్స్‌లో ఘోస్ట్ అవహించిన సీన్స్‌లో అద్భుతంగా నటించిందని చెప్పాలి. హైపర్ ఆది సినిమా కథలు, రైటర్స్ మీద వేసిన పంచ్‌లు నవ్వించాయి. తను కనిపించిన కాసేపు సందడి చేశాడు. తనికెళ్ల భరణి, మకరంద్ దేశ్‌పాండే పాత్రల పరిధి మేర నటించారు. సుదర్శన్, భద్రమ్, శ్రీకాంత్ అయ్యంగర్ కూడా ఫర్వాలేదనిపించారు.
- సినిమాటోగ్రాఫర్ చిన్మయ్ సాలస్కర్ పనితనం బావుంది
- మ్యూజిక్ విషయానికొస్తే ఉన్న ఒక్క పాట ఆకట్టుకునేలా లేదు. అయితే హారర్ కథకు కావలసిన నేపథ్యం సంగీతం చక్కగా అందించాడు చేతన్ భరద్వాజ్.
- నిర్మాత సాహు గారపాటి నిర్మాణం విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు
- మొత్తం మీద ఈ సినిమా ఫస్టాప్ కాస్త ఎంగేజింగ్‌గా ఉన్నా.. సెకెండాఫ్ పూర్తిగా నిరుత్సాహ పరచింది.
- హీరోతోపాటు నిర్మాత ఈ కథకు ఎలా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా అన్న సందేహం కలగక మానదు.
- తొలి చిత్రం ‘చావు కబురు చల్లగా’ పరాజయం తర్వాత కౌశిక్ పెగళ్లపాటికి దక్కిన సెకెండ్ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోలేకోయారు.
- హారర్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయాలనుకుని వచ్చిన ఆడియన్స్ థియేటర్ నుంచి ‘ఇదెక్కడి బోరింగ్ థ్రిల్లర్ రా బాబు’ అంటూ బయట పడటం ఖాయం.
ట్యాగ్‌లైన్: బోరింగ్ థ్రిల్లర్
రేటింగ్: 2/5
సౌజన్యం : ఆంధ్రజ్యోతి | పూర్తి రివ్యూ లింక్


దయ్యం వెనుక నేపథ్యం ఎంత కొత్తగా రాసుకున్నారు.. కథలో ట్విస్టులు ఎంత బాగా పేలాయి.. ప్రేక్షకులను ఎంతగా ఆశ్చర్యపరిచారు అన్న దాన్ని బట్టి ఆ కథ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ మూడు విషయాల్లోనూ ‘కిష్కింధపురి’కి మంచి మార్కులే పడతాయి. దయ్యం బ్యాక్ స్టోరీ సినిమాలో అతి పెద్ద హైలైట్. దీంతో పాటు ఉత్కంఠ రేపే కథనం.. కొన్ని మలుపులు కూడా తోడవడంతో ‘కిష్కింధపురి’ థ్రిల్లింగా మారింది. కొన్ని లోపాలున్నప్పటికీ.. అక్కడక్కడా లాజిక్స్ కొండెక్కేసినప్పటికీ… ఒక హార్రర్ థ్రిల్లర్ నుంచి ఆశించే అంశాలకు ఇందులో లోటు లేదు.
హార్రర్ థ్రిల్లర్స్ లో కొన్ని సినిమాలు పూర్తిగా భయపెట్టడం.. థ్రిల్ చేయడం మీద దృష్టిసారిస్తాయి. కొన్ని చిత్రాలు దీన్నుంచి నవ్వులు పంచే ప్రయత్నమూ చేస్తుంటాయి. ‘కిష్కింధపురి’ పూర్తిగా మొదటి కోవలోనే సాగుతుంది. ఏమాత్రం డీవియేషన్ లేకుండా పూర్తిగా ప్రేక్షకులను భయపెట్టడం.. థ్రిల్ చేయడం మీదే ఈ సినిమా ఫోకస్ చేసింది. ఆరంభ సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా ఉండడం వల్ల కథ ఊపందుకోవడానికి కాస్త సమయం పడుతుంది. పైగా హార్రర్ చిత్రాల రొటీన్ ఫార్మాట్ నే ఇది అనుసరించడంతో ఒక దశ వరకు మామూలుగానే అనిపిస్తుంది. హార్రర్ సినిమాల్లో ఎక్కువగా ఆడ దయ్యాలనే చూస్తాం. ఇది కూడా ఆ బాపతులాగే అనిపిస్తుంది. తమిళ డ్యాన్స్ మాస్టర్ శాండీని ఆ పాత్రకు ఎంచుకోవడం.. తన అవతారం.. స్క్రీన్ ప్రెజెన్స్.. అన్నీ కూడా ప్రేక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. ఆ పాత్ర ప్రవేశం నుంచి కథనం ఒక్కసారిగా ఊపందుకుంటుంది. అక్కడ్నుంచి చివరి వరకు కిష్కింధపురిలో థ్రిల్స్ కు లోటు ఉండదు.
కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ మిస్సయ్యాయి. పకడ్బందీ బ్యాక్ స్టోరీ తర్వాత దయ్యం పాత్ర ఊహించుకున్నంత బలంగా కనిపించదు. కానీ ‘కిష్కింధపురి’లో ఏ దశలోనూ కథనం నెమ్మదించదు. సన్నివేశాలు రయ్యిన పరిగెడుతూనే ఉంటాయి. చివరి వరకు ట్విస్టులు కొనసాగడం.. థ్రిల్స్ కు లోటు లేకపోవడం.. భారీతనంతో కూడిన క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. ఇది పర్ఫెక్ట్ హార్రర్ థ్రిల్లర్ అని చెప్పలేం కానీ.. రెండు గంటల పాటు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టి థ్రిల్ చేయడంలో ‘కిష్కింధపురి’ విజయవంతమైంది.
చివరగా: కిష్కింధపురి.. థ్రిల్లింగ్ అండ్ చిల్లింగ్
రేటింగ్ – 2.75/5

Mahidhar vibes ఛానల్ వీడియో రివ్యూ

Barbell Pitch Meetings ఛానల్ వీడియో రివ్యూ

ragadi ఛానల్ వీడియో రివ్యూ

Thyview ఛానల్ రివ్యూ

Movies4u Official ఛానల్ ఆడియో రివ్యూ

Kotha Muchata ఛానల్ ఆడియో రివ్యూ

Movie Matters ఆడియో రివ్యూ
FEATU GADI MEDIA ఛానల్ ఆడియో రివ్యూ


