Kamal+Rajni multistarrer movie | After 46 years… Official news!
కోట్ల మంది సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మల్టీస్టారర్ అధికారికమైంది. ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుల్లో ముందు వరుసలో ఉండే కమల్‌హాసన్, రజనీకాంత్‌లు ఇప్పుడు 46 ఏళ్ల తర్వాత కలిసి స్క్రీన్‌పై కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ రానుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను కమల్‌హాసన్ అధికారికంగా ప్రకటించారు. దీంతో వీరి అభిమానులు సంబరపడుతున్నారు.

ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకలో కమల్‌హాసన్ ‘మీరు, రజనీకాంత్ కాంబినేషన్‌లో ఓ సినిమాను ఆశించవచ్చా’ అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘‘ప్రేక్షకులు మా కాంబినేషన్‌ను ఇష్టపడితే మంచిదే కదా.. వారు సంతోషంగా ఉంటే మాకూ ఆనందమే. మేమిద్దరం కలిసి నటించాలని ఎన్నోఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ, ఇన్ని రోజులు అది కుదర్లేదు. త్వరలోనే మీ ముందుకు కలిసి రానున్నాం. అది మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది’’ అని స్పష్టంచేశారు. దీంతో ఈ బిగ్ మల్టీస్టారర్ అధికారికమైంది. అయితే, ఈ ప్రాజెక్ట్ వివరాలు మాత్రం ఆయన పంచుకోలేదు.

