ott movies this weekend: ఈ వారం ఓటీటీలో సినిమాలు | వెబ్‌సిరీస్‌లు

Kuberaa ott || శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సినీప్రియుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఏఐపై యుద్ధం..

Special ops 2 ott || ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్‌సిరీస్‌ల్లో ‘స్పెషల్ ఓపీఎస్2’ ఒకటి. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం జులై 11నే ఈ సిరీస్ అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ శుక్రవారానికి వాయిదా వేసినట్లు ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ నుంచి వచ్చే సవాళ్లతో తీర్చిదిద్దిన సరికొత్తగా ‘స్పెషల్ ఓపీఎస్2’ను తీర్చిదిద్దారు
ఇప్పుడు ఓటీటీలో యాక్షన్..

Bhairavam Movie ott || బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై కథానాయికలు. మే 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ జులై 18వ తేదీ నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
DNA Ott || తమిళంలో ఘన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ ‘డీఎన్ఏ’. తెలుగులో ‘మై బేబీ’ పేరుతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, శనివారం నుంచి తమిళంతో పాటు, తెలుగులోనూ ఈ మూవీని జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తుండటం గమనార్హం. థియేటర్‌లో విడుదలైన 24 గంటల్లోనే ఓటీటీ వస్తోందన్నమాట. అధర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేశన్ దర్శకుడు.

The Bhootnii OTT || సంజయ్ దత్, మౌనీ రాయ్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ మూవీ ‘భూత్‌నీ’ (The Bhootnii). సిద్ధాంత్ సచ్‌దేవ్ దర్శకత్వం వహించారు. దెయ్యాల్ని వదిలించే బాబాగా సరికొత్త అవతారంలో సంజయ్ కనిపించి అలరించారు. మే 1న విడుదలైన ఈ మూవీ ఇప్పుడు జీ5 ఓటీటీతో పాటు, జీ సినిమాలోనూ ఒకేసారి జులై 18న (the bhootnii ott release date) స్ట్రీమింగ్‌కు వచ్చింది.
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
- హెచ్‌బీవో మ్యాక్స్
- బిల్లీ జోయల్ అండ్ సో ఇట్ గోస్ (మూవీ) జులై 19
- నెట్‌ఫ్లిక్స్
- అమీ బ్రాడ్లీ ఈజ్ మిస్సింగ్ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది
- అన్‌ట్యామ్డ్ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది
- విర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (మూవీ) జులై 18
- వాల్ టు వాల్ (మూవీ) జులై 18
- టు కిల్ ఏ మంకీ (మూవీ) జులై 18
- ఐ.ఎస్.ఎస్. (మూవీ) జులై 19
- అమెజాన్ ప్రైమ్ వీడియో
- ది సమ్మర్ ఐ టర్డ్న్ ప్రెట్టీ (వెబ్‌సిరీస్: సీజన్3) జులై 18