ఈ వారం(21-8-25) ఓటీటీలో సరికొత్త వినోదాలు.. సినిమాలు/వెబ్‌సిరీస్‌లు!  

August 21, 2025

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందిన హిస్టారికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Hari Hara Veera Mallu Ott Platform) వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది. క్లైమాక్స్‌ సహా కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేశారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటు ఉంది.

షైన్ టామ్ చాకో, విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్ కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘సూత్రవాక్యం’. ఇటీవల మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకులను  మెప్పించింది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఓటీటీ వేదికగా (soothravakyam ott) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో (ETV Win) స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్‌ చేసేందుకు మరో సినిమా సిద్ధమైంది. ఆగస్టు 22వ తేదీ నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) వేదికగా ‘మారీశన్‌’ (Maareesan) మూవీ అందుబాటులోకి రానుంది. ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil), వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ఇది. సుదీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు.

విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), నిత్యా మేనన్‌ (Nithya Menon) నటించిన తాజా చిత్రం ‘తలైవా తలైవి’. దీన్ని తెలుగులో ‘సార్‌ మేడమ్‌’ (Sir Madam) పేరుతో విడుదల చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కథ.. ఇప్పుడు ఓటీటీలో వినోదం పంచేందుకు సిద్ధమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా (Amazon Prime video) ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు వచ్చిన మరో చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ (Kothapallilo Okappudu). ఈ కామెడీ డ్రామా మూవీ ఈ నెల 22 నుంచి ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌ కానుంది. ‘ఆహా గోల్డ్‌’ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారు ప్రస్తుతం వీక్షించవచ్చు. ‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’, ‘ఉమా మ‌హేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాల నిర్మాత ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. హీరో రానా (Rana Daggubati) సమర్పకుడిగా వ్యవహరించారు. మనోజ్‌ చంద్ర, మౌనిక తదితరులు ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.

ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • రివర్స్‌ ఆఫ్ ఫేట్‌ (వెబ్‌సిరీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • హోస్టేజ్‌ (వెబ్‌సిరీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • మా (హిందీ మూవీ) ఆగస్టు 22
  • ది కిల్లర్‌ (మూవీ) ఆగస్టు 24
  • అమెజాన్‌ ప్రైమ్‌
  • రోడ్‌ఆన్‌ ఏ మిలియన్‌ సీజన్‌2 (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 22
  • జియో హాట్‌స్టార్‌
  • పీస్‌ మేకర్‌సీజన్‌2 (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • యాపిల్‌ టీవీ
  • ఇన్‌వేషన్‌: సీజన్‌3 (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 22

సౌజన్యం : ఈనాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *