Mirai – Telugu pan India movie – Collection of Reviews – Links

మిరాయ్; నటీనటులు: తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియ శరణ్, జగపతిబాబు, జయరామ్, పవన్ చోప్రా, రాజేంద్రనాథ్ తదితరులు; సంగీతం: గౌర హరి; ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్; నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్; సినిమాటోగ్రఫీ, రచన, దర్శకత్వం: కార్తిక్ ఘట్టమనేని; విడుదల: 12-09-2025


కథేంటంటే..
Mirai Storyline || సామ్రాట్ అశోక్ కళింగ యుద్ధం గెలిచాక.. జరిగిన విధ్వంసాన్ని తలచుకుని పశ్చాత్తాప్పడతాడు. ఆ వినాశనానికి తనలోని దైవశక్తే ఓ కారణమని భావించి.. ఆ శక్తిని తొమ్మిది గ్రంథాల్లో నిక్షిత్తం చేసి.. వాటి రక్షణ బాధ్యతను తొమ్మిది మంది యోధుల చేతుల్లో పెడతాడు. కొన్ని శతాబ్దాల తర్వాత ఆ గ్రంథాలపై దుష్టశక్తి మహావీర్ లామా (మంచు మనోజ్) కన్నుపడుతుంది. అతను తనకున్న తంత్ర శక్తులతో ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఎనిమిది మహిమాన్విత గ్రంథాల్ని.. దానికి రక్షణగా ఉన్న యోధుల్ని తుద ముట్టించి హస్తగతం చేసుకుంటాడు. అయితే అతను కోరుకున్నట్లుగా అమరత్వాన్ని సాధించి.. ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలంటే తొమ్మిదో గ్రంథం అవసరమవుతుంది. కానీ, అమరత్వానికి సంబంధించిన ఆ గ్రంథాన్ని సొంతం చేసుకోవడం అంత తేలిక కాదు. ఎందుకంటే దానికి రక్షణగా ఉండేది అంబిక (శ్రియ). మహావీర్ రూపంలో ప్రపంచానికి ఎదురు కానున్న ముప్పును ముందే జ్ఞాన దృష్టితో చూసిన అంబిక.. అతన్ని ఎదుర్కొనేందుకు తనకు పుట్టిన బిడ్డ వేద (తేజ సజ్జా)ను పసికందుగా ఉన్నప్పుడే దూరం చేసుకుంటుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అనాథగా వివిధ ప్రాంతాల్లో పెరిగిన వేద తన బాధ్యతను.. తల్లి ఆశయాన్ని ఎలా తెలుసుకుంటాడు? మహావీర్ లామా నుంచి ప్రపంచానికి ఎదురు కానున్న ముప్పును తప్పించేందుకు అతనేం చేశాడు? ఇందుకు అతనికి రాముడు సృష్టించిన మిరాయ్ అస్త్రం ఎందుకు అవసరమైంది? చివరికి యుద్ధంలో ఎవరు గెలిచారు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఈ సినిమా కోసం కార్తీక్ ఘట్టమనేని (mirai director) రాసుకున్న కథ.. దాన్ని తెరపై విజువల్‌గా ఆవిష్కరించిన విధానం బాగున్నాయి. కాకపోతే కథను అక్కడక్కడా సాగదీశాడేమో అనిపిస్తుంది. గౌర హరి సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణను ఇచ్చాయి. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నిర్మాణ సంస్థ పెట్టిన శ్రద్ధ.. ఈ చిత్రానికి వాళ్లు పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది.
- బలాలు
- + తేజ సజ్జా, మంచు మనోజ్ నటన
- + యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్
- + విరామ, పతాక ఘట్టాలు
- బలహీనతలు
- – సాగదీతగా కొన్ని సన్నివేశాలు
- – నిడివి
- చివరిగా: ‘మిరాయ్’.. కనులవిందు.. యాక్షన్ పసందు!
సౌజన్యం : ఈనాడు | పూర్తి రివ్యూ కోసం లింక్


త్రేతాయుగం నాటి రాముడి ఆయుధం ‘మిరాయ్’. దాన్ని పొందగలిగితే విజయం తధ్యం! మిరాయ్ ను అందుకోవడానికి వేద ఎలాంటి సాహసాలు చేశాడు? తన మీద తనకే నమ్మకం లేని అతను… ప్రజల కోసం, బ్లాక్ స్వార్డ్ తాంత్రిక శక్తుల నుండి వారిని కాపాడటం కోసం ప్రాణాలకు తెగించి ఎలా పోరాటం చేశాడనేది ఆసక్తికరంగా తెరకెక్కించాడు కార్తీక్ ఘట్టమనేని.
మిరాయ్ కోసం సాగించే అన్వేషణతో ప్రథమార్థం సాగితే, బ్లాక్ స్వార్డ్ కు చరమగీతం పాడటంతో ద్వితీయార్థం ముగిసింది. ‘హను-మ్యాన్’ మూవీలో హనుమంతుడి సాయంతో ఓ సాధారణ యువకుడు విలన్ పని పట్టినట్టుగానే ఇందులోనూ క్లయిమాక్స్ లో శ్రీరాముని సాయం అతనికి లభించిందన్నట్టుగా చూపించారు.
- నేపథ్య గీతం, సంగీతంతో క్లయిమాక్స్ ను మరో స్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నం సంగీత దర్శకుడు గౌరహరి చేశాడు.
- సినిమా ఆసాంతం చందమామ కథను వెండితెరపై చూస్తున్నట్టు అనిపిస్తుంది.
- జటాయువు సోదరుడు సంపాతితో చేసే పోరాటం, రాముడు ధ్యానం చేసిన స్థలంలో జరిగే ఫైటింగ్, క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి.
- ఇక ప్రతినాయకుడు మంచు మనోజ్ పాత్ర నేపథ్యం, అతను అలా తయారు కావడానికి చూపించే కారణాలు ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది.
- కథను.. వి.ఎఫ్.ఎక్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేసే ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి.
- తేజ సజ్జా తన పాత్ర వరకూ బాగా చేశాడు, ఈజ్ తో నటించాడు.
- ఎంతో పాపులర్ అయిన ‘వైబ్ ఉంది బేబీ… వైబ్ ఉందిలే’ పాట లేకపోవడం నిరాశ కలుగుతుంది.
- ఈ సినిమాపై మంచు మనోజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టే కొన్ని సన్నివేశాలలో హీరో కంటే మంచు మనోజ్ పాత్రకే ఎక్కువ ఎలివేషన్స్ లభించింది. మనోజ్ కూడా బాగా కష్టపడ్డాడు.
- ఇక సీక్వెల్ తీయవచ్చనే ఆలోచనతో రానా తో తదుపరి భాగానికి లీడ్ ఇవ్వడం విశేషం
- సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ ఘట్టమనేని తానే సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. దానికి నూటికి నూరుశాతం న్యాయం చేశాడు.
- ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ గౌర హరి సంగీతం, వీఎఫ్ఎక్స్ అని చెప్పాలి.
- మణిబాబు కరణం సంభాషణలు, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్షన్ అన్నీ కూడా సినిమాను ఎలివేట్ చేసే విధంగానే ఉన్నాయి.
- నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ కూడా ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిర్మించారు. దాని ఫలితం తెర మీద కనిపిస్తోంది.
రేటింగ్ : 3.25/5
ట్యాగ్ లైన్: అందమైన చందమామ కథ ‘మిరాయ్’
సౌజన్యం : చిత్రజ్యోతి | పూర్తి రివ్యూ కోసం లింక్

Mahidhar Vibes ఛానల్ వీడియో రివ్యూ

Mr B ఛానల్ వీడియో రివ్యూ

Thyview ఛానల్ వీడియో రివ్యూ

RED TV ఛానల్ వీడియో రివ్యూ

The Review Point ఛానల్ “హిందీ” రివ్యూ

India Today ఛానల్ రివ్యూ “ఇంగ్లీష్”లో
Mirai Public Review | Fans Rave About Climax | India Today

Cinemapicha ఛానల్ వీడియో రివ్యూ

Nippu Nagaraj ఛానల్ ఆడియో రివ్యూ

Man Of Fiction ఛానల్ వీడియో రివ్యూ

Viralbollywood ఛానల్ పబ్లిక్ రియాక్షన్స్

Hit TV Talkies ఛానల్ వీడియో రివ్యూ

YOGI BOLTA HAI ఛానల్ రివ్యూ -హిందీ

Barbell Pitch Meetings ఛానల్ వీడియో రివ్యూ

మిరాయ్ మూవీ పేజి : చూడటానికి లింక్



