కార్తీక మిస్సింగ్ కేసు అనేది ఒక ఉత్కంఠభరితమైన డ్రామా, ఇది తప్పిపోయిన అమ్మాయి కోసం డిటెక్టివ్ మరియు అతని బృందం వెతుకుతున్న తీరును అనుసరిస్తుంది. ఈ ప్రక్రియలో, కార్తీక గురించి వారికి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆమె ఎవరు? ఆమె అధికారం మరియు ఆర్థిక దోపిడీకి ఎలా గురైంది? ఇప్పుడే కనుగొనండి.
IMDb రేటింగ్: 6.4/10
Pratinidhi 2
నిజాన్ని నిర్భ‌యంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్ర‌శ్నించే నిఖార్స‌యిన జ‌ర్న‌లిస్ట్ చే అలియాస్ చేత‌న్ (నారా రోహిత్‌). చిన్న‌ప్పుడు త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఆయ‌న గ‌మ్యాన్ని నిర్దేశిస్తాయి. ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేసే చేత‌న్‌ని ఎన్‌.ఎన్‌.సి ఛాన‌ల్ ఏరికోరి సీఈఓగా నియ‌మిస్తుంది. రాజ‌కీయ నాయ‌కులు చేస్తున్న అక్ర‌మాల‌ని చాక‌చ‌క్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాల్నే ప్ర‌భావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్య‌మంత్రి ప్ర‌జాప‌తి (స‌చిన్ ఖేడేక‌ర్‌)పై హ‌త్యాయ‌త్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సీబీఐ ప‌రిశోధ‌న‌లో ఎలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి? నారా రోహిత్‌ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
రామ్ అలియాస్ రాబిన్‌హుడ్ (నితిన్‌) ఎవ‌రూ లేని ఓ అనాథ. త‌న‌లాంటి తోటి పిల్ల‌ల‌తో క‌లిసి ఓ అనాథ శ‌ర‌ణాల‌యంలో ఆశ్ర‌యం పొందుతుంటాడు. ఆక‌లి, అవ‌స‌రాల కోసం నేరాల బాట పట్టిన రామ్‌.. తెలివిగా చోరీలు చేస్తూ అనాథ శ‌ర‌ణాల‌యాల‌కి అండ‌గా నిలుస్తుంటాడు. పెరిగి పెద్ద‌య్యాక కూడా అదే బాట‌లోనే అతడి ప్ర‌యాణం కొన‌సాగుతుంది. బంగారం చోరీ కేసులో ఐపీఎస్ అధికారి విక్ట‌ర్ వ‌ర్ఘీస్ (షైన్ టామ్ చాకో) చేతికి చిక్కిన‌ట్లే చిక్కి త్రుటిలో త‌ప్పించుకున్న రామ్, కొన్నాళ్లు నేరాల‌బాట వీడి ఉద్యోగం చేయాల‌నుకుంటాడు. అలా జాన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) న‌డుపుతున్న ఇండియాస్ నంబ‌ర్‌వ‌న్ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరి, ఆస్ట్రేలియా నుంచి వ‌చ్చిన నీరా వాసుదేవ్ (శ్రీలీల‌) ర‌క్ష‌ణ బాధ్య‌త‌ల కోసం రంగంలోకి దిగుతాడు. అస‌లు ఎవ‌రీ నీరా వాసుదేవ్? ఆమె ఇండియాకి ఎందుకొచ్చింది?అంత‌ర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్న డ్ర‌గ్ మాఫియా ఆమెని ఎందుకు టార్గెట్ చేసింది?అపాయంలోఉన్న నీరా వాసుదేవ్‌కి రామ్ ర‌క్ష‌ణ క‌ల్పించాడా లేదా?అనేది మిగ‌తా క‌థ‌.
IMDb రేటింగ్: 4.5/10
మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) ఓ కాలేజీలో లెక్చరర్ జాబ్ చేస్తుంటాడు. అతడి సంతానంలో పెద్ద కొడుకు అర్జున్(మొయిన్ మొహమద్) లవ్ ఫెయిల్యూర్ కారణంగా మందుకు బానిసగా మారుతాడు. ఇక రెండో కొడుకు సాయి(మోహిత్) ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. అతడి కూతురు అనుపమ(యశస్విని) పద్దతిగా ఉంటూ మెదులుతుంది. అయితే, ఓ సందర్భంలో అనుపమకు సంబంధించి ఓ నిజం చుట్టుపక్కల వారికి తెలియడంతో అందరూ కృష్ణ కుమార్ అండ్ ఫ్యామిలీ గురించి చర్చించుకుంటారు. ఇంతకీ అనుపమ గురించి తెలిసిన నిజం ఏమిటి..? ఆమె ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది..? కృష్ణ కుమార్ కొడుకుల భవిష్యత్తు ఏమవుతుంది..? అనేది సినిమా కథ.
IMDb రేటింగ్: 8.3/10
మారేడుకోన గ్రామంలో అనుమానాస్పదమైన రితీలో మరణాలు జరుగుతుంటాయి. అను (అనన్య నాగళ్ల) అనే అమ్మాయి కోసం వెతుక్కొంటూ విక్రమ్ (విజయ్ ధరణ్ దాట్ల) ఆ గ్రామానికి వెళ్తాడు. అయితే అక్కడే పనిచేసే ఎస్ఐ కూతురు (అను)తో విక్రమ్ ప్రేమలో పడుతాడు. తను వెతుక్కొంటూ వచ్చిన అను మరణించిందనే విషయాన్ని తెలుసుకొంటాడు.
విక్రమ్ వెతుక్కొంటూ వచ్చిన డాక్టర్ అను ఎవరు? డాక్టర్ అను ఎలా మరణించింది? గ్రామానికి అను ఎందుకు వచ్చింది? ఎస్ఐ కూతురు అనుతో విక్రమ్ ఎలా ప్రేమలో పడ్డాడు? మారేడుకోనలో పెద్దిరెడ్డి అధిపత్యం, అక్రమాలు ఎలా కొనసాగాయి? అను మరణం వెనుక అసలు కారణాన్ని విక్రమ్ తెలుసుకొన్నాడా? అను మృతికి కారణమైన వ్యక్తికి విక్రమ్ ఎలాంటి శిక్షను వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే అన్వేషి సినిమా కథ.
IMDb రేటింగ్: 6.3 / 10
సోమన్ ప్రకృతితో సామరస్యంగా జీవించడాన్ని నమ్మే వ్యవసాయ అధికారి. అయితే, అతని జీవన విధానం అతనిని తన గ్రామంతో, అతని భార్యతో కూడా విభేదిస్తుంది.
Leharayi Telugu movie
సత్య (అథర్వ) ​​అనే పోలీసు అధికారి, కాల్ సెంటర్‌లో పనిచేసే నిషా (హన్సిక)తో ప్రేమలో పడతాడు. అతను పోలీసు శాఖలో చేరిన వెంటనే, అతనికి ఒక అమ్మాయి తప్పిపోయిందని అనుమానాస్పద కాల్ వస్తుంది మరియు అతను కేసును ఛేదిస్తాడు. సమాంతరంగా, యువతులను అపహరించి అమ్మే బృందం ఉంటుంది. సత్యకు వచ్చిన 100వ కాల్ కిడ్నాప్ చేయబడిన ఇతర అమ్మాయిలతో ఎలా సంబంధం కలిగి ఉందనేది 100 మంది కథను రూపొందిస్తుంది.
Featured
కథ: జై (ప్రభాస్) ఇటలీలో మానస (రిచా గంగోపాధ్యాయ) తో ప్రేమలో పడతాడు. ఆమె కుటుంబ సభ్యులు పల్నాడు ప్రాంతానికి చెందిన క్రూరమైన ఫ్యాక్షనిస్టులు అనే పేరున్న నేపథ్యం కలిగి ఉన్నారని ఆమె అతనికి చెబుతుంది. జైకి శాంతి తత్వం మరియు ప్రేమ జీవనశైలి ఉంది. యుద్ధం ద్వారా కాదు, ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చని అతను భావిస్తాడు. అతను వేరే సాకుతో మానస గ్రామానికి వెళ్లి ఫ్యాక్షనిస్టుల వైఖరిని మారుస్తాడు. మిగిలిన కథ అంతా జై నేపథ్యం మరియు అతను శాంతిని ప్రచారం చేసే వ్యక్తిగా ఎలా మారాడు అనే దాని గురించి.
IMDb రేటింగ్: 7.3/10
చిత్రం - డీజే దువ్వాడ జగన్నాథం,
నటీనటులు - అల్లు అర్జున్,పూజా హెగ్డే,
స్క్రీన్ ప్లే-రమేష్ రెడ్డి, దీపక్ రాజ్, సినిమాటోగ్రఫీ: అయనంక బోస్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఎడిటర్:ఛోటా కె ప్రసాద్, ఫైట్స్:రామ్-లక్ష్మణ్, కళ:రవీందర్,
కథ-మాటలు - దర్శకత్వం: హరీష్ శంకర్,
నిర్మాతలు:దిల్ రాజు & శిరీష్
IMDb రేటింగ్ : 6/10
ఆత్రేయపురం అనే ఊర్లోని రాజుగారు (ప్రకాష్ రాజ్), జానకమ్మ (జయసుధ) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పిల్లలంతా విదేశాల్లో స్థిరపడితే, రాజుగారు మాత్రం తన ఊర్లోనే భార్య జానకమ్మ, మనవడు రాజు (శర్వానంద్)తో కలిసి ఉంటారు. విదేశాల్లో స్థిరపడిపోయి ఎప్పుడూ తమను చూడడానికి కూడా రాని పిల్లల కోసం రాజు గారు ఎప్పుడూ కలత చెందుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన ఓ పథకం వేసి, తన పిల్లలంతా సంక్రాంతికి వచ్చేలా చేస్తాడు. ఇలా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆయన మనవరాలు నిత్యా (అనుపమ పరమేశ్వరన్), రాజుతో పరిచయం పెంచుకొని అతడితో ప్రేమలో కూడా పడిపోతుంది. సంక్రాంతి సంబరాలు ఇలా జరుగుతుండగానే, రాజుగారు వేసిన పథకం ఆయన భార్యకు తెలిసి గొడవ జరుగుతుంది. కుటుంబంలోనూ పలు విబేధాలు వస్తాయి. రాజుగారు వేసిన ఆ పథకం ఏంటి? అసలు ఆయన తన పిల్లలకు ఏం చెప్పాలనుకొని ఆ పథకం వేశాడు? రాజు, నిత్యాల ప్రేమకథ ఏమైంది? అన్నదే సినిమా.
విడుదల తేదీ: 02 జూన్,2016
అనసూయ రామలింగం (సమంత) ఓ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన యువతి. తన తల్లి మహాలక్ష్మి (నదియా) ఇష్టం మేరకే అందరూ నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో బతికే అనసూయకు ఈ జీవితం బోరింగ్‍గా కనిపిస్తూంటుంది. ఈ క్రమంలోనే ఓ సారి తండ్రి రామ లింగం (నరేష్) సలహా మేరకు, కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలని అనసూయ తన అత్త ఇంటికి వెళుతుంది. అక్కడే ఆమెకు బావ ఆనంద్ విహారి (నితిన్) పరిచయమవుతాడు. కొద్దిరోజుల్లోనే అనసూయ, ఆనంద్ విహారికి చాలా దగ్గరవుతుంది.
కాగా ఇదే సమయంలో ఆనంద్ విహారి కుటుంబం మాత్రం కొన్ని ఇబ్బందుల్లో ఉంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆనంద్, పల్లం వెంకన్న (రావు రమేష్) కూతురు నాగవల్లి (అనుపమ)తో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా అనసూయ తల్లి మహాలక్ష్మికి, ఆనంద్ కుటుంబానికి ఏళ్ళుగా వైరం ఉంటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అనసూయ, ఆనంద్ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చెప్పుకున్నారా? ఆ ప్రేమ ఫలించిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
IMDb రేటింగ్ : 6.8/10
ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజన్సీలో గౌతమ్(గోపీచంద్) ఓ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు. చాలా వేగంగా ధనవంతుడు అయిపోవాలనేది అతని లక్ష్యం. దాంతో అతని లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బాబాలను కలిసి జాతకాలు చూపించుకుంటూ, లాటరీ టికెట్స్ కొంటూ ఉంటాడు. కానీ అతని లక్, లాటరీ టికెట్ల ఫలితాలు అతన్ని బాగా నిరుత్సాహపరుస్తుంటాయి. అప్పుడే అతనికి ఓ కొత్త దారి దొరుకుతుంది. గౌతమ్ కి తన తాత గారైన వర్మ(సుమన్) భారత్ – పాకిస్థాన్ విడిపోకముందు పెషవర్ లో వజ్రాల బిజినెస్ ఉంటుంది. వర్మ అప్పట్లో తన వారసుల కోసం అని వజ్రాలను ఓ చోట దాచి పెట్టి ఉంటారు. అది తెలిసిన గౌతమ్ ఎలాగైనా వాటిని సంపాదించాలనుకుంటాడు. అనుకోకుండా ఆ వజ్రాల నిధి పాకిస్థాన్ లో ఉంటుంది, అది కూడా లెజండ్రీ హింగ్లాజ్ దేవి టెంపుల్ కి ముడిపడి ఉంటుంది.
తన తాత గారి వీలునామా, ఆయన తయారు చేసిన కొన్ని వస్తువులతో తన నిధిని ఎలాగైనా దక్కించుకోవాలని పాకిస్థాన్ బయలుదేరుతాడు. అందుకోసం హిందూ మతానికి, దేవాలయాలకు ప్రాధాన్యత నిచ్చే శ్రీనిధి(తాప్సీ) సాయం తీసుకుంటాడు. కానీ గౌతమ్ అనుకున్న జర్నీ అంత సులభం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌతమ్ కి ఆ ప్రోపర్టీ పాకిస్థాన్ టెర్రరిస్ట్ అయిన సుల్తాన్(శక్తి కపూర్) చేతిలో ఉంటుంది. వారందరినీ ఎదిరించి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా? లేదా? అనే అడ్వెంచరస్ డ్రామాని తెరపైనే చూడాలి.
IMDb రేటింగ్: 6.8/10
తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని రహస్య గదుల నుండి ఒక చిన్న బంగారు గణేష్ విగ్రహం దొంగిలించబడింది. విగ్రహం యొక్క పురాతన విలువ కారణంగా విగ్రహం మార్కెట్ ధర భారీగా ఉంటుంది. సూర్య (నిఖిల్) హైదరాబాద్‌లో ఒక అధునాతన జేబు దొంగ మరియు అతను అతని ముఠాలోని ఒక అమ్మాయి మరియు ఒక వ్యక్తి. స్వాతి (స్వాతి) ఒక జర్నలిస్ట్, ఆమె తనకు ఇష్టమైన పసుపు వెస్పా స్కూటర్‌ను కొనుగోలు చేస్తుంది. దుర్గ (రవి బాబు) ఒక దుర్మార్గుడు మరియు అతను విగ్రహాన్ని ఎలా అయినా కాజేయాలనుకుంటాడు.దొంగిలించబడిన గణేష్ విగ్రహం ఈ ముగ్గురు వ్యక్తుల మరియు ఇతరుల జీవితాలను ఎలా పెనవేసుకుంటుంది అనేది మిగిలిన కథ.
IMDb రేటింగ్ : 7.3/10
అప్పదాసు (SPB) ఒక రిటైర్డ్ టీచర్ మరియు అతను తన భార్య బుచ్చి (లక్ష్మి)తో కలిసి తన స్వగ్రామంలో నివసిస్తున్నాడు. ఇద్దరూ సీనియర్ సిటిజన్లు మరియు వారి పిల్లలందరూ విదేశాలలో నివసిస్తున్నారు. కానీ వారి జీవితం గురించి ఒంటరిగా మరియు అభద్రతా భావానికి బదులుగా, అప్పదాసు మరియు బుచ్చి ఇద్దరూ తమదైన ప్రేమను కలిగి ఉంటారు మరియు వారు ప్రతి రోజును ఒక ప్రత్యేక రోజుగా భావిస్తారు మరియు క్షణాలను ఆస్వాదిస్తారు. ఈ సంబంధంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి మరియు జీవితం వారి కోసం ఏమి నిల్వ చేస్తుందో మిగిలిన కథను రూపొందిస్తుంది. IMDb రేటింగ్ : 8.1/10
మహేష్ బాబు,సమంత,బ్రహ్మానందం మరియు ప్రకాష్ రాజ్ మొదలగువారు నటించిన దూకుడు తెలుగు సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా, థమన్ ఎస్ సంగీతం అందించారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట గోపీచంద్‌ ఆచంట అనిల్‌ సుంకర నిర్మించారు.
_పూర్తి కథ కోసం లింక్
అమెజాన్ ప్రైమ్ వీడియో లింక్
IMDb రేటింగ్: 7.4/10

స్లమ్ బస్తీలో ఉండే కేబుల్ కుర్రాడు ఆనంద్ రాజు(అల్లు అర్జున్). జూబ్లీహిల్స్ లో ఉండే ఓ డబ్బున్న అమ్మాయి(దీక్షా సేధ్)తో కోటీశ్వరుడి కొడుకుని అని అబద్దం చెప్పి ప్రేమలో పడతాడు. ఆమె పార్టీకి రమ్మందని టిక్కెట్లు కోసం డబ్బు దొంగతనానికి కూడా రెడీ అవుతాడు. మరో ప్రక్క వివేక్ చక్రవర్తి(మనోజ్)ఓ రాక్ స్టార్. అతను పాడే పాటల అర్దాలకీ అతని చేష్టలకీ సంభంధం ఉండటం లేదని గర్ల్ ప్రెండ్ (లేఖా వాషిగ్ టన్) విసుక్కుంటూంటుంది. అతని తల్లి ఆర్మీలో చేరమంటే రిజెక్టు చేసి రాక్ బ్యాండ్ పోగ్రాం కోసం బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇదిలా ఉంటే తెలంగాణ పల్లెలో అప్పులు పాలైన ఓ బక్క చిక్కిన రైతు కూలీ తన మనవడు చదువుకోసం కిడ్నీని అమ్ముకోవటానికి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇంతలో హైదరాబాద్ లో ఉండే రహీం అనే ముస్లిం(మనోజ్ బాపపేయి)తనకు హిందువుల వల్ల అవమానం, నష్టం జరిగాయి ఈ దేశంలో ఉండటం అనవసరం అనుకుని షార్జా బయిలుదేరటానకి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇక ఫైనల్ గా ఈ చిత్రంలో చెప్పబడుతున్న సరోజ(అనూష్క) అనే వేశ్య హైదరాబాద్ లో వ్యబిచారం బాగా జరుగుతుందని అమలాపురం నుంచి తప్పించుకుని పారిపోయి వస్తుంది. ఆమెను అమలాపురం వ్యబిచార కేంద్ర బ్యాచ్ వెంబడిస్తూంటుంది. ఇలా రకరకాల ఆలోచనలతో హైదరాబాద్ చేరుకున్న వీరందరూ ఏ విధంగా తమ ప్రవర్తనను మార్చుకున్నారు. జీవితంలో ఏమార్పు వచ్చిందనేది తెరపై చూడాల్సిన కథ.
IMDb రేటింగ్: 8/10

 

పూరీ మాస్‌ ట్రీట్‌మెంట్‌కి మహేష్‌ క్లాస్‌ యాక్షన్‌ కలిపి తయారు చేసిన కాక్‌టెయిల్‌'పోకిరి'సినిమా.పండు(మహేష్‌బాబు)కిరాయి గుండా.'నేనెంత వెధవనో నాకే తెలియదు' అని అంటూ ఒప్పుకున్న పనులను ఎంద మంది ఎదురొచ్చినా సునాయసంగా పూర్తి చేస్తూ వుంటాడు హీరో.శృతి(ఇలియానా) ఎరోబిక్‌ టీచర్‌.తండ్రిలేని కుటుంబానికి అన్నీ తానే అయి నెట్టుకొస్తూ వుంటుంది.పశుపతి(ఆశీష్‌ విద్యార్థి) అనే పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఆమెపై కన్నేసి వెంటపడుతూ వుంటే పండు అండతో తప్పించుకుంటుంది. తర్వాత ప్రేమలో పడి పాటలు పాడుతూ వుంటుంది. మరో పక్క పండు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని బెదిరించి లోకల్‌ మాఫియా దగ్గర పనిచేస్తూ పక్క గ్రూప్‌తో తగువు పడతాడు. వాళ్లు అతనిపై కక్ష పెంచుకుని అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈలోగా సిటీకి కొత్తగా వచ్చిన పోలీసు అధికారి (సాయాజి షిండే) ఈ గ్రూప్‌లను అణచేయాలని అనుకుంటూ వుంటాడు. పండు ఆ పరిస్థితుల్లో ఏం చేశాడు,ఎలా రియాక్ట్‌ అయ్యాడు అన్నది తెరపై చూడాల్సిందే.ప్రత్యేకంగా పోకిరిగా మహేష్‌ బాబు వంక పెట్ట వీలు లేని విధంగా నటించాడు.
సీతా మహాలక్ష్మి ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల. సొంతంగా తన కాళ్ళమీద నిలబడాలని వ్యాపారం చేస్తుంటుంది కానీ అతి కష్టమ్మీద నెట్టుకొస్తుంటుంది. ఒక వైపు తల్లిదండ్రులు చూస్తున్న పెళ్ళి సంబంధాలు కూడా ఏదో ఒక కారణంతో తిరగ్గొడుతూ ఉంటుంది. రామ్ అమెరికాలో ఎమ్మెస్ చదివి వచ్చి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అమ్మమ్మ, మామయ్య దగ్గర పెరుగుతాడు. మరదలు రాజీ అంటే రాముకి అభిమానం. కానీ మేనల్లుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని అతనికి పిల్లనివ్వడానికి మేనమామ అంగీకరించడు. రాజీకి ఐపీఎస్ అధికారి అయిన రవీంద్రతో పెళ్ళి నిశ్చయం అవుతుంది. రాజీ కూడా బావను కాదని రవీంద్ర వైపే మొగ్గు చూపుతుంది. అందరూ కలిసి పడవలో గోదావరి నది మీద భద్రాచలం ప్రయాణమవుతారు. పెళ్ళి సంబంధం కుదరకపోవడంతో సీత కూడా అదే పడవలో బయలు దేరుతుంది. అక్కడ రాము పద్ధతిని చూసి అతన్ని అభిమానించడం మొదలుపెడుతుంది. రాజీ మీద అతనికున్న అభిమానాన్ని తెలుసుకుంటుంది కానీ అతని వ్యక్తిత్వానికి ఆమె సరిపోదని, తానే అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కొన్ని పరిస్థితుల్లో రవీంద్ర ధోరణిని గమనించిన రాజీ, మళ్ళీ రామునే పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. రాము ఒప్పుకుంటున్నట్లుగా నటించి సీతను తాను ఒక చోటుకి తీసుకురమ్మని చెబుతాడు. కానీ రాము మాత్రం అక్కడికి రాడు. రాజీ రవీంద్రనే పెళ్ళి చేసుకుంటానని మనసు మార్చుకుంటుంది. సీత మాత్రం రాము మనసులో తాను లేనని తెలుసుకుని తిరిగి హైదరాబాదు వెళ్ళిపోతుంది. రాము సీత పడవలో మరిచిపోయిన డైరీ చదివి ఆమె తనను ప్రేమించిన విషయం తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్ళి తన ప్రేమను వ్యక్తం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది.
IMDb రేటింగ్: 7.9/10
శ్రీను(నాగార్జున) ఉత్సాహవంతుడైన యువకుడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా జీవితం గడిపే తత్వం అతనిది. అతని తల్లి మహాలక్ష్మికి అతనంటే వల్లమాలిన ప్రేమ. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న మూర్తి కుటుంబం కూడా వీళ్ళతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఒకసారి మహాలక్ష్మి అలియాస్ పండు(టబు) అనే అమ్మాయి పైలట్ శిక్షణ తీసుకోవడానికి హైదరాబాదు వస్తుంది. మూర్తి వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ కుటుంబ వాతావరణాన్ని బాగా ఇష్టపడుతుంది. క్రమంగా శీనును ఇష్టపడటం ప్రారంభిస్తుంది. శ్రీనుకు కూడా ఆమె నచ్చుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. శీను కుటుంబానికి కూడా నచ్చడంతో వాళ్ళ పెళ్ళికి అందరూ అంగీకరిస్తారు. ఇంతలో పండు నిజానికి పెళ్ళి రోజు ఇంట్లోంచి పారిపోయిన శీను మేనత్త కూతురని తెలుస్తుంది. కుటుంబ గొడవల మధ్య శీను, మహాలక్ష్మిలు ఎలా కలిశారన్నది మిగతా కథ.

Showing 1–24 of 30 results