Vayuputra – 3D – Chandu Mondeti – Nagavansi’s new movie announcement
వాయుపుత్ర’ (Vayuputra) పేరుతో దీన్ని చందూ మొండేటి (Chandoo Mondeti) తెరకెక్కించనున్నట్లు నాగవంశీ చెప్పారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని ఓ అద్భుతమైన పవిత్ర దృశ్య కావ్యమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది దసరాకు దీన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. ‘మన చరిత్ర, ఇతిహాసాలు, పురాణాల్లోని గొప్ప కథతో ఇది వస్తోంది. త్రీడీ యానిమేషన్‌లో ఒకేసారి 5 భాషల్లో విడుదలవుతుంది’ అంటూ పోస్టర్‌ను షేర్ చేశారు . హనుమంతుడి జీవిత కథగా ఇది రానున్నట్లు పోస్టర్ ఆధారంగా తెలుస్తోంది.
